అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Google Maps | ఒకప్పుడు తెలియని ప్రాంతాలకు వెళితే మనకు కావాల్సిన అడ్రస్ కోసం ఇతరులను అడిగేవాళ్లం. కానీ ప్రస్తుతం సాంకేతికత పెరిగింది. గూగుల్ మ్యాప్స్ (google maps) అందుబాటులోకి రావడంతో కొత్త ప్రాంతాలకు వెళ్లే వారు దానిని ఆశ్రయిస్తున్నారు. గమ్యస్థానాన్ని ఎంచుకొని ఎంచక్కా మ్యాప్ చూపెట్టిన డైరెక్షన్లో వెళ్తున్నారు. అప్పుడప్పుడు గూగుల్ మ్యాప్ చేసే పొరపాట్లతో పలువురు బొక్కబోర్ల పడుతున్నారు. తాజాగా ఇటాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ (Uttrar Pradesh)లో చోటు చేసుకుంది
ఓ వ్యక్తి తాను వెళ్లాల్సిన చోటును గూగుల్ మ్యాప్‌లో సెట్ చేసుకొని కారులో బయలు దేరాడు. ఇంకేముంది గూగుల్ చెప్పిన దారిలో కారును పోనిచ్చాడు. ఈ క్రమంలో మహారాజ్‌గుంజ్(Maharajgunj)లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌పైకి కారును తీసుకెళ్లాడు. కారు వేగంగా వెళ్తుండగా.. ముందు దారి లేదని డ్రైవర్ గుర్తించాడు. సడన్ బ్రేక్ వేసే లోపే కారు ఫ్లై ఓవర్ పై నుంచి జారి పడింది. అయితే ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు.
