HomeతెలంగాణGanesh Immersion | సార్వజనిక్ గణేశ్​ మండలి రథానికి పూజలు

Ganesh Immersion | సార్వజనిక్ గణేశ్​ మండలి రథానికి పూజలు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : Ganesh Immersion | సార్వజనిక్ గణేశ్​ మండలి (Sarvajanik Ganesh Mandali) రథానికి శనివారం ఉదయం రైల్వే గేట్ సమీపంలోని గణపతి ఆలయం ముందు ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయం నుంచి దుబ్బా చౌరస్తాకు తరలించి మధ్యాహ్నం రథయాత్రను ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వేలేటి పశుపతి శర్మ, సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షుడు బంటు గణేశ్​, ప్రధాన కార్యదర్శి శివకుమార్ పవార్, కోశాధికారి శ్రీనివాస్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Ganesh Immersion | 12 గంటలకు ప్రారంభం

రథయాత్రను మధ్యాహ్నం 12 గంటలకు దుబ్బ చౌరస్తాలో ప్రారంభించనున్నారు. తొలుత మున్నూరు కాపు సంఘం గణపతిని రథంలో ఎక్కించనున్నారు. అనంతరం ముఖ్య అతిథులు కాషాయ జెండా ఊపి రథయాత్రను ప్రారంభిస్తారు. లలితా మహల్, గంజ్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్ పవన్ థియేటర్, అహ్మదీ బజార్, గాజుల్​పేట, పెద్ద బజార్ గోల్ హనుమాన్, పూలాంగ్, మీదుగా వినాయకుల బావి వద్దకు రథం చేరుకోనుంది. వినాయక నిమజ్జనం కోసం ఇప్పటికే నగరపాలక సంస్థ పూర్తి ఏర్పాటు చేసింది. పోలీసులు (Police) బందోబస్తు ఏర్పాటు చేశారు.

Must Read
Related News