అక్షరటుడే, ఇందూరు: Neela Kanteshwara Temple | ఇందూరుకే కంఠాభరణంగా neck of Indur పేరొందిన నీల కంఠేశ్వరాలయం భక్తుల పాలిట కొంగు బంగారంలా విరాజిల్లుతోంది.
నీల కంఠుడిగా భక్తులచే పూజలందుకుంటున్న శివ లింగం నిజామాబాద్ జిల్లా Nizamabad district కేంద్రానికే తలమానికం. ఎంతో వైభవం కలిగిన ఈ ఆలయంలో ఆ పరమేశ్వరుడిని భక్తులు నిత్యం కొలుస్తూ తరిస్తున్నారు.
శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయంలోని అమ్మవారిని భక్తులు భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నారు. రోజుకో అవతారంతో దేవిని నిష్ఠతో పూజిస్తున్నారు.
Neela Kanteshwara Temple | హోమం..
ఆదివారం భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సుహాస్, నిలేశ్, మకరంద్, చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చంఢీ హోమం నిర్వహించారు.