HomeUncategorizedAmsterdam | 200 ఏళ్ల నాటి కండోమ్.. చరిత్రలో ఒక ఆసక్తికరమైన అధ్యాయం

Amsterdam | 200 ఏళ్ల నాటి కండోమ్.. చరిత్రలో ఒక ఆసక్తికరమైన అధ్యాయం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Amsterdam | మనకు ఆధునిక కాలంలో కండోమ్స్ Condom సులభంగా లభ్యమవుతున్నా.. వీటి చరిత్ర చాలా పురాతనమైంది. మీకు ఆశ్చర్యంగా ఉన్నా.. కండోమ్స్‌కు కనీసం 200 ఏళ్ల చరిత్ర ఉంది.

అప్ప‌ట్లో కండోమ్‌ల‌ని గొర్రెల పేగుల నుంచి తయారు చేసేవారట. ఇది 18వ లేదా 19వ శతాబ్దానికి చెందినదిగా తేలింది. పూర్వం గొర్రెలు, పందులు, దూడలు, మేకలు వంటి జంతువుల పేగులతో కండోమ్‌లను తయారు చేసేవారు. వాటిని మృదువుగా మార్చేందుకు నీటిలో నానబెట్టి, అవసరమైన ఆకారంలో మలిచేవారు. ఈ కండోమ్స్(Condoms) పునర్వినియోగానికి అనుకూలంగా ఉండేవి. వాడిన తరువాత శుభ్రం చేసి, మళ్లీ వాడే విధంగా రూపొందించబడ్డవి. ఇది మనకు కొత్తగా అనిపించినా, ఆ రోజుల్లో ఇది సాధారణమే. ఇప్పటికీ మంచి కండీషన్‌లో ఉన్న సుమారు 200 ఏళ్ల నాటి కండోమ్‌ను నెదర్లాండ్స్‌(Netherlands)లోని ఆమ్‌స్టర్‌డామ్‌(Amsterdam)లో గల రిజ్క్స్ మ్యూజియం(Rijksmuseum)లో ప్రదర్శనకు ఉంచారు.

Amsterdam | దీని స్పెషాలిటీ ఏంటి..?

ఈ ఫొటోలో క‌నిపించే కండోమ్ 1830 సంవత్సరం నాటిది. 2024లో జరిగిన ఒక వేలంలో మ్యూజియం దీనిని కొనుగోలు చేసింది. కాగా.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కండోమ్‌గా పేరుగాంచింది. దీని ఖ‌రీదు 460 పౌండ్లు.. అంటే దాదాపు రూ. 44 వేలకు(ఇండియన్ కరెన్సీలో) అమ్ముడైంది. ఇది ఆధునిక లేటెక్స్ కండోమ్‌ల నుంచి భిన్నంగా ఉంటుంది. ఇప్పటికీ మంచి కండీషన్‌లో నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో గల రిజ్క్స్ మ్యూజియంలో Museum ప్రదర్శనకు ఉంది. ఆ కాలంలో అవాంఛిత గర్భాలు, లైంగికంగా సంక్రమించే వ్యాధులు, ముఖ్యంగా సిఫిలిస్ వంటి వాటికి కూడా చాలా భయపడేవారు.

ఇక ఈ కండోమ్‌పై ఒక డ్రాయింగ్‌ Drawing కూడా ఉంది. అందులో ఒక నన్ కాళ్లు రెండూ దూరంగా చాచి కూర్చుని ఉండగా, ఆమె ముందు ముగ్గురు నిలబడి ఉన్నారు. వారి వైపు నన్ తన వేలును చూపుతూ ఉండ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. దీనిపై “వొయిలా మోన్ చోయిక్స్” అనే పదాలు కూడా ఉన్నాయి, అంటే “ఇదిగో నా ఎంపిక” అని అర్థం. ఈ చిత్రం బ్రహ్మచర్యాన్ని ఎగతాళి చేయడంతో పాటు, పారిస్ అనే ట్రోజన్ యువరాజు ఆఫ్రొడైట్, హేరా, అథీనాల మధ్య అత్యంత అందమైన దేవతను ఎంచుకునే గ్రీకు పురాణాన్ని ఎగతాళి చేసే ఒక జోక్‌ అని మ్యూజియం చెప్పుకొచ్చింది. ఇక ఇలాంటి ప్రింట్ ఉన్న కండోమ్ దొరకడం ఇదే మొదటిసారి. 2025 నవంబర్ చివరి వరకు ఈ కండోమ్ ప్రదర్శనలో ఉంటుందట‌..!