అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Medicover Hospital | నగరంలోని మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ వెన్నుముక (స్పైన్) దినోత్సవం (World Spine Day), అలాగే అనస్థీషియా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి న్యూరోసర్జన్ కృష్ణాదిత్య ( neurosurgeon Krishnaditya) మాట్లాడుతూ.. మారుతున్న ఆధునిక జీవనశైలితో చాలామంది వెన్నునొప్పితో బాధపడుతున్నారని అన్నారు.
ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, మొబైల్, ల్యాప్‌టాప్‌ల అధిక వినియోగంతో మెడ, వెన్నునొప్పి (neck and back pain) వంటి సమస్యలతో బాధపడుతున్నారన్నారు. ఆస్పత్రిలో ఇప్పటివరకు 300కు పైగా న్యూరో సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.
వెన్ను నొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని, సరైన భంగిమలో కూర్చోవడం, వ్యాయామం చేయడం, సరైన శరీర బరువుతో వీటిని అధిగమించవచ్చన్నారు. శస్త్రచికిత్సల్లో అనస్థీషియా విభాగం పాత్ర ముఖ్యమైందని, రోగి సురక్షితంగా ఉండేందుకు అనస్థీషియా నిపుణుల సహకారం అత్యంత కీలకమన్నారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ అనస్థీషియా నిపుణులు డా వాను చేసిన కృషిని ప్రత్యేకంగా అభినందించారు.