అక్షరటుడే, ఇందూరు: World Schizophrenia Day | స్కిజోఫ్రెనియా వ్యాధి సోకిన వాళ్లు అధైర్యపడకుండా మానసికంగా దృఢంగా ఉండాలని మానసిక వైద్య నిపుణులు విశాల్ (Psychiatrist DR. Vishal) సూచించారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ స్కిజోఫ్రీనియా డే (World Schizophrenia Day) సందర్భంగా అవగాహన కల్పించారు. వ్యాధి లక్షణాలను మొదట్లోనే గుర్తించి వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ఉండాలన్నారు. అనంతరం వ్యాధి అవగాహన పట్ల కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో వైద్యులు నవీన్, భవాని ప్రసాద్, జీవన్రావు తదితరులు పాల్గొన్నారు.