world lions day

World Lions Day | ప్రపంచ సింహాల దినోత్సవం.. ఏంటి పళ్లు పుచ్చిపోవ‌డం వ‌ల‌న సింహాలు చనిపోతున్నాయా?

అక్షరటుడే, వెబ్​డెస్క్: World Lions Day  | ఈ రోజు ప్ర‌పంచ సింహాల దినోత్స‌వం కాగా, సింహాల‌కి సంబంధించిన కొన్ని విష‌యాలు తెలుసుకుందాం. అవి విన్నాక ఆశ్చ‌ర్యం క‌లుగ‌క మాన‌దు. మనుషులలాగే, జంతువులు కూడా తమ దంతాల ద్వారా ఆహారం తీసుకుంటాయి. అందులో సింహం కూడా మినహాయింపు కాదు. అడవిలో రాజుగా (king of the jungle) పేరొందిన సింహం తన బలమైన దంతాల ద్వారానే వేటాడి, మాంసాన్ని చీల్చి తింటుంది. కానీ చాలా మందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే సింహాల Lions మరణానికి దంత స‌మ‌స్య‌లు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఏడాది ఆగస్టు 10న ప్రపంచ సింహాల దినోత్సవాన్ని ( world lions day) జరుపుకుంటారు. 2013లో ఇది మొదలైంది. ఈ దినోత్సవం ద్వారా సింహాల మనుగడపై అవగాహన పెంచడం, వాటి సంఖ్య తగ్గిపోవడం వెనుక ఉన్న కారణాలను విశ్లేషించడం ప్రధాన లక్ష్యం.

World Lions Day | ఇవి కార‌ణ‌మా?

చిరుతపులి, పులి, సింహం వంటి మాంసాహార జంతువులకు పళ్లు చాలా ముఖ్యం. ఇవి తమ వేటను, ఆహారం తినడాన్ని పళ్లతోనే చేస్తాయి. అయితే మనుషులకున్నంతగా కాకపోయినా, వీటి పళ్లు కూడా పాడవడానికీ, పుచ్చిపోవ‌డానికి అవకాశం ఉంది. సాధారణంగా, పెద్ద పిల్లుల లాలాజలంలో (saliva) అధిక pH ఉండడం వల్ల, వాటి దంతాలు ఎక్కువకాలం దెబ్బతినకుండా ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో, వీటి పళ్లలో కుళ్ళు, దంతక్షయం, చిగుళ్ల వ్యాధులు వస్తే.. అది చాలా సీరియస్ అవుతుంది.

వేటలో భాగంగా సింహానికి దంతాలు (Teeth) ప్రధాన ఆయుధం. వాటి సహాయంతోనే ఇవి ఆహారం సంపాదిస్తాయి. కానీ దంతాల్లో సమస్యలు వచ్చినపుడు పళ్లు ఊడిపోవడం, బలహీనపడటం, నొప్పి, ఇన్ఫెక్షన్లు మొదలవవచ్చు. ఈ పరిస్థితుల్లో సింహం వేటాడలేకపోతుంది, తినలేకపోతుంది. దీని వల్ల శరీర బలహీనతకు (body weakens) లోనై, క్రమంగా చనిపోతుంది. చిలీ వంటి దేశాల్లోని జంతుప్రదర్శనశాలలో ఉన్న సింహాలు, అడవిలో ఉన్న సింహాల కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నాయి. ఎందుకంటే వాటికి మృదువైన ఆహారం (soft food) అందించబడుతుంది. వెటర్నరీ పశువైద్యులు పళ్లను క్రమం తప్పకుండా పరీక్షించి, అవసరమైతే చికిత్స చేస్తారు.దీని వల్ల పళ్లు పాడై ప్రమాదం తక్కువగా ఉంటుంది. దంతాలు అన్నవి కేవలం మానవులకు మాత్రమే ముఖ్యం కాదు. అడవి రాజు సింహానికి కూడా జీవితం నిలబెట్టే సాధనమే.