అక్షరటుడే, ఇందూరు: World Diabetes Day | మధుమేహం ఇప్పుడు పెద్దవారికే కాకుండా యువతలో కూడా వేగంగా పెరుగుతోందని మెడికవర్ హాస్పిటల్స్ Medicover Hospital వైద్యులు దత్తు రాజ్(జనరల్ మెడిసిన్) చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 20 ఏళ్ల లోపు 11 లక్షల మందికి పైగా పిల్లలు, యువకులు టైప్-1 మధుమేహంతో బాధపడుతున్నారు. అలాగే 15–19 ఏళ్ల వయసులో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం గత మూడు దశాబ్దాలలో రెండింతలు పెరిగింది.
ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ దత్తు రాజ్(జనరల్ మెడిసిన్) General Medicine అక్షరటుడేతో మాట్లాడారు. మధుమేహం గురించి వివరించారు.
“మధుమేహం చిన్న వయసులోనే ఎక్కువగా కనిపించడం ఆందోళనకరం. ముందస్తు గుర్తింపు, క్రమమైన పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించడం ద్వారా దీర్ఘకాలిక సమస్యలను నివారించవచ్చు” అని తెలిపారు.
మధుమేహం ప్రధాన లక్షణాలు :— అధిక దాహం, తరచూ మూత్ర విసర్జన, బరువు తగ్గడం, అలసట, గాయాలు ఆలస్యంగా మానడం మధుమేహం ప్రధాన లక్షణాలని వైద్యడు తెలిపారు.
కారణాలు : అధిక బరువు, కుటుంబ చరిత్ర, రక్తపోటు లేదా వ్యాయామం లేకపోవడం. ఇలాంటివారు క్రమం తప్పకుండా రక్త చక్కెర పరీక్ష చేయించుకోవాలని డాక్టర్ సూచించారు.
World Diabetes Day నివారణ చర్యలు:
సమతుల్య ఆహారం :– పిండి పదార్థాలు carbohydrates, కూరగాయలు vegetables, తేలిక ప్రోటీన్లతో light proteins కూడిన ఆహారం తీసుకోవాలి.
నిత్య వ్యాయామం :– రోజూ కనీసం 30 నిమిషాలు శారీరక వ్యాయామం చేయాలి.
వీటికి దూరం :– ధూమపానం, మద్యం మానేయాలి. ఒత్తిడిని నియంత్రించాలి.
జాగ్రత్త చర్యలు :– వైద్యుల సూచనల ప్రకారం మందులు వాడాలి. వైద్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలి.
డాక్టర్ దత్తు రాజ్ MD మాట్లాడుతూ “రోజువారీ చిన్న మార్పులు అవసరం. వ్యాయామం చేయడం, ప్రాసెస్డ్ ఆహారం తగ్గించడం అనేవి రక్త చక్కెర నియంత్రణలో గణనీయమైన మెరుగుదలను తీసుకువస్తాయి..” అని వివరించారు. అవగాహన, ముందస్తు చర్యలు, ఆరోగ్యకరమైన జీవనశైలితో మధుమేహం నివారణ సాధ్యమేనని చెప్పుకొచ్చారు.