Homeక్రీడలుWorld Cup Qualifiers | అండర్-19 వరల్డ్ కప్ అమెరికాస్ క్వాలిఫయర్స్‌లో సంచలనం.. ఐదు బంతుల్లో...

World Cup Qualifiers | అండర్-19 వరల్డ్ కప్ అమెరికాస్ క్వాలిఫయర్స్‌లో సంచలనం.. ఐదు బంతుల్లో ముగిసిన మ్యాచ్

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: World Cup Qualifiers | ప్రపంచ క్రికెట్‌లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిర్భవించింది. అండర్-19 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌ లో భాగంగా కెనడా Canada జట్టు కేవలం ఐదు బంతుల్లోనే మ్యాచ్‌ను ముగిస్తూ, క్రికెట్ చరిత్రలో స‌రికొత్త రికార్డు సృష్టించింది.

జార్జియాలోని పరమ్ వీర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కెనడా (Canada team) తనకంటే బలహీన జట్టు అర్జెంటీనా(Argentina)ను మట్టికరిపించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన అర్జెంటీనా జట్టు.. కెనడా బౌలర్ జగ్మన్‌దీప్ పాల్ (6 వికెట్లు – 7 పరుగులు) విజృంభణకు తేలిపోవడంతో, కేవలం 23 పరుగులకే ఆలౌట్ అయింది.

అర్జెంటీనా జట్టులో (Under-19 World Cup Qualifiers) ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా రెండంకెల‌ స్కోర్ చేయలేకపోయాడు.

World Cup Qualifiers : మ‌రో రికార్డు..

అతిస్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన కెనడా ఓపెనర్లు ధర్మ్ పటేల్ (1 నాటౌట్) – యువరాజ్ సమ్రా (22 నాటౌట్) చరిత్రాత్మక ఆట తీరు కనబరిచారు.

మొదటి బంతికి సింగిల్ తీయగా.. యువరాజ్ సమ్రా Yuvraj Samra నాలుగు బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాదడంతో, కెనడా టార్గెట్‌ను కేవలం 5 బంతుల్లోనే ఛేదించింది.

ఇది వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా సాధించిన విజయాల్లో ఒకటిగా నిలిచింది. గతంలో, 2004లో ఆసీస్ (Australia) జట్టు స్కాట్లాండ్‌(Scotland)ను 22 పరుగులకే ఆలౌట్ చేసి, 3.5 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించింది.

కానీ, ఈసారి కెనడా దాన్ని మించి, ఒక ఓవర్లోనే విజయం సాధించింది. కెనడా ఆట‌గాళ్లు ఈ విజయంతో క్రికెట్‌లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించారు.

కేవలం ఐదంటే ఐదు బంతుల్లోనే ఒక జట్టు మ్యాచ్‌ను ముగించ‌డం ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది.

ఒక్కోసారి పెద్ద జ‌ట్లు కూడా ఊహించ‌ని ప‌రిస్థితుల‌లో త‌క్కువ ర‌న్స్‌కి ఆలౌట్ అవుతుండ‌టం మ‌నం చూస్తూనే ఉన్నాం.

ఫుట్‌బాల్‌కు కేరాఫ్ అయిన దక్షిణ అమెరికా South America దేశపు జట్టు 19.4 ఓవ‌ర్లు ఆడి కేవ‌లం 23 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌డం కూడా అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.