Homeజిల్లాలునిజామాబాద్​World Candlelight Day | జీజీహెచ్​లో వరల్డ్ క్యాండిల్ లైట్ డే ర్యాలీ

World Candlelight Day | జీజీహెచ్​లో వరల్డ్ క్యాండిల్ లైట్ డే ర్యాలీ

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: World Candlelight Day : నిజామాబాద్ జీజీహెచ్(GGH, Nizamabad) ఆవరణలో ఆదివారం సాయంత్రం క్యాండిల్ లైట్ డే నిర్వహించారు. హెచ్ఐవీ(HIV) బారిన పడి చనిపోయిన బాధితుల స్మారకార్థం ఏటా మే నెల మూడో ఆదివారం క్యాండిల్ లైట్ డే నిర్వహిస్తారు. ఈ మేరకు ఆసుపత్రి ఆవరణలో డాక్టర్ అవంతి, డాక్టర్ భార్గవి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఆస్పత్రి నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది.

ఎయిడ్స్ బారినపడి చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో dpm సుధాకర్, టీబీ కోఆర్డినేటర్ రవి, పాజిటివ్ నెట్​వర్క్, స్నేహ సొసైటీ, YRG LWS, వర్డ్ NGO, DM & హాస్పిటల్ సిబ్బంది, DAPCU, TB సిబ్బంది పాల్గొన్నారు.