ePaper
More
    HomeతెలంగాణWorld Brain Tumor Day | మెదడు మాట వినండి..!

    World Brain Tumor Day | మెదడు మాట వినండి..!

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: World Brain Tumor Day | తరచూ తలనొప్పిని పని ఒత్తిడిగా భావిస్తున్నారా.. మతిమరుపును (Forgetfulness) వయసు ప్రభావంగా, కళ్లు తిప్పడాన్ని అలసటగా తేలికగా తీసుకుంటున్నారా.. అయితే ఒకసారి సీరియస్‌గా ఆలోచించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, ఒక్కోసారి ఈ సాధారణ లక్షణాలే మన మెదడులోని తీవ్రమైన సమస్యకు సంకేతాలు కావొచ్చని చెబుతున్నారు. ఏటా జూన్‌ 8న ప్రపంచ బ్రెయిన్‌ ట్యూమర్‌ దినోత్సవం నేపథ్యంలో ప్రత్యేక కథనం..

    World Brain Tumor Day | బ్రెయిన్​ ట్యూమర్లు ఎవరికైనా రావొచ్చు..

    బ్రెయిన్‌ ట్యూమర్లు అరుదైనవి కావు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికైనా రావొచ్చు. ముఖ్యంగా, ప్రారంభ లక్షణాలు తరచుగా ఇతర సాధారణ ఆరోగ్య సమస్యలుగా కనిపించి, తర్వాత క్లిష్టమైనవి మారుతాయి. సరైన సమయంలో గుర్తించి చికిత్స పొందితే, ప్రాణాపాయం ఉండదని, అంతేగాక, జీవన నాణ్యతను మెరుగుపర్చుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

    ఎవరికైనా ఉదయం తరచుగా వచ్చే తీవ్రమైన తలనొప్పులు, వ్యక్తిత్వంలో అకస్మాత్తుగా మార్పులు, చూపు మసకబారడం, మాట తడబడటం, మతిమరుపు లేదా గతంలో ఎప్పుడూ లేని ఫిట్స్‌ (మూర్చ) (Fits) వంటి లక్షణాలను గమనిస్తే, వీటిని నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తున్నారు. ఇవి బ్రెయిన్‌ ట్యూమర్‌ సంకేతాలు కావొచ్చని హెచ్చరిస్తున్నారు. వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించి, అవసరమైన చికిత్స పొందడం ముఖ్యమని పేర్కొంటున్నారు.

    World Brain Tumor Day | అందుబాటులో అధునాతన చికిత్సలు..

    బ్రెయిన్‌ ట్యూమర్‌ వ్యాధికి ప్రస్తుతం అధునాతన వైద్యం అందుబాటులోకి వచ్చింది. నిపుణులైన వైద్యులు, అధునాతన ఎమ్మారై(MRI), న్యూరో–నావిగేషన్‌ సిస్టమ్స్ (Neuro-navigation systems), మినిమల్‌ ఇన్వాసివ్‌ సర్జరీ(Minimally invasive surgery), రోబోటిక్‌ సర్జరీ(Robotic surgery) వంటి అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి, రోగులకు సురక్షితమైన, వేగవంతమైన చికిత్స అందిస్తున్నారు. అందుకే పైలక్షణాలున్నవారు ఒకసారి స్కాన్‌ చేయించుకోవడం మేలని సూచిస్తున్నారు.

    సకాలంలో గుర్తిస్తే మేలు..

    – డాక్టర్​ శ్రీ కృష్ణదిత్య, న్యూరో సర్జన్‌

    ట్యూమర్‌ లక్షణాలు సకాలంలో గుర్తిస్తేనే సరైన సమయంలో చికిత్స అందించవచ్చు. తలనొప్పి, మతిమరుపు, కళ్లు తిరగడం, అకస్మాత్‌ మూర్చ వంటి లక్షణాలుంటే వైద్యుల సలహాతో ముందుగా స్కాన్‌ చేయించుకోవాలి. లక్షణాలను ముందుగానే గుర్తించి, సకాలంలో చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడవచ్చు.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...