అక్షరటుడే, వెబ్‌డెస్క్ : World Bank | పహల్గామ్ ఉగ్రదాడి (pahalgam terror attack) తర్వాత భారత్ పాకిస్తాన్‌పై పలు ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా సింధూ నది జలాల ఒప్పందాన్ని indus river treaty కూడా రద్దు చేసుకుంది. ఈ ఒప్పందం సింధూ నది జలాల వినియోగంపై భారత్, పాకిస్తాన్ మధ్య 1960లో ప్రపంచ బ్యాంక్ (world bank) మధ్యవర్తిత్వంతో కుదిరింది. కాగా ఈ ఒప్పందం రద్దుపై ప్రపంచ బ్యాంకు స్పందించింది. ఒప్పందం నుంచి భారత్ వైదొలగడంపై తాము జోక్యం చేసుకోలేమని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా తెలిపారు. ప్రపంచ బ్యాంకు సహాయక పాత్ర మాత్రమే పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
అజయ్ బంగా శుక్రవారం భారత్‌లో పర్యటించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath)తో ఆయన సమావేశం నిర్వహించారు. భారత్ పర్యటనలో భాగంగా సింధూ నది జలాల ఒప్పందం రద్దుపై ఆయన స్పందించారు. కాగా ఒప్పందం రద్దు ఏకపక్షమని వాదిస్తున్న పాక్‌కు వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడి వ్యాఖ్యలతో షాక్ ఇచ్చినట్లయింది.