ePaper
More
    HomeజాతీయంWorld Bank | దేశంలో గ‌ణ‌నీయంగా త‌గ్గిన పేద‌రికం.. కేంద్ర ప్ర‌భుత్వ విధానాలే కార‌ణం

    World Bank | దేశంలో గ‌ణ‌నీయంగా త‌గ్గిన పేద‌రికం.. కేంద్ర ప్ర‌భుత్వ విధానాలే కార‌ణం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: World Bank | ద‌శాబ్దాల కాలంగా పేద‌రికంతో అల్లాడిపోతున్న భార‌త్ క్ర‌మంగా ఆ జాడ్యం నుంచి క్ర‌మంగా బ‌య‌ట ప‌డుతోంది. గ‌త ద‌శాబ్దాంలో పేదరిక రేటును (poverty rate) త‌గ్గించ‌డంలో మోదీ ప్ర‌భుత్వం కీల‌క పురోగ‌తి సాధించింది. 2011-12లో 27.1 శాతంగా ఉన్న పేద‌రిక రేటు.. 2022-23 నాటికి 5.3 శాతానికి తగ్గిందని ప్రపంచ బ్యాంకు తాజా డేటా వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనిక ప్రభుత్వం (government) సాధించిన అద్భుత‌మైన విజ‌యానికి తాజా గ‌ణంకాలు అద్దం ప‌డుతున్నాయి. 2022-23లో ఇండియాలో దాదాపు 75.24 మిలియన్ల మంది తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారు. అయితే, ఇది 2011-12లో 344.47 మిలియన్లు ఉంది. కేంద్ర ప్ర‌భుత్వ విధానాల (central government policies) వ‌ల్ల ప్ర‌స్తుతం ఆ సంఖ్య భారీగా త‌గ్గిపోయింది. ప్రపంచ బ్యాంకు డేటా (World Bank data) ప్రకారం సుమారు 11 సంవత్సరాలలో 269 మిలియన్ల మంది తీవ్ర పేదరికం నుంచి బయటపడినట్లు తేలింది.

    World Bank | ఆ రాష్ట్రాలే కీల‌కం..

    పేద‌రికాన్ని త‌గ్గించ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వ విధానాలు (Central government policies), రాష్ట్రాల స‌హ‌కారం కీల‌కంగా మారాయి. 2011-12లో దేశంలో అతిపెద్ద రాష్ట్రాల్లోనే అత్య‌ధికంగా పేద వారు ఉండే వారు. దేశ అత్యంత పేదరికంలో 65 శాతం ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, 2022-23 నాటికి మొత్తం తీవ్ర పేదరికం తగ్గుదలకు దోహదపడ్డాయి. “క‌చ్చితంగా చెప్పాలంటే, తీవ్ర పేదరికంలో ఉన్న ప్రజల సంఖ్య‌ 344.47 మిలియన్ల నుంచి 75.24 మిలియన్లకు త‌గ్గిపోయింద‌ని” ప్రపంచ బ్యాంకు తాజా డేటా (World Bank data) వెల్ల‌డించింది.

    World Bank | 3డాల‌ర్ల కంటే త‌క్కువ వినియోగం..

    రోజుకు స‌గ‌టున 3 డాలర్ల కంటే (2021 ధరలను ఉపయోగించి) త‌క్కువ‌గా వినియోగించే వారిని పేద‌రికంలో ఉన్న‌ట్లు ప్ర‌పంచ బ్యాంకు (World Bank) గుర్తిస్తుంది. 2017 ధరల ఆధారంగా మునుపటి దారిద్య్రరేఖకు $2.15 రోజువారీ వినియోగం వద్ద – తీవ్ర పేదరికంలో నివసిస్తున్న భారతీయుల వాటా 2.3 శాతంగా ఉండ‌గా, ఇది 2011-12లో 16.2 శాతం కంటే గణనీయంగా తక్కువ అని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. రోజుకు $2.15 దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న వారి సంఖ్య 2022లో 33.66 మిలియన్లుగా ఉండ‌గా, తాజా డేటా ప్రకారం, 2011లో 205.93 మిలియన్లకు త‌గ్గిన‌ట్లు వ‌ర‌ల్డ్ బ్యాంక్ నివేదిక (World Bank report) వెల్ల‌డించింది. గత 11 సంవత్సరాలలో గ్రామీణ తీవ్ర పేదరికం 18.4 శాతం నుంచి 2.8 శాతానికి, పట్టణ తీవ్ర పేదరికం 10.7 శాతం నుండి 1.1 శాతానికి తగ్గడం గ‌మ‌నార్హం. అంతేకాకుండా, మ‌ల్టీ డైమెన్ష‌న‌ల్ పావ‌ర్టీ ఇండెక్స్ (MPI) తగ్గించడంలోనూ ఇండియా అద్భుతమైన పురోగతిని సాధించింది. MPI 2005-06లో 53.8 శాతంగా ఉండ‌గా, 2019-21 నాటికి 16.4 శాతానికి తగ్గింది. ఇక‌ 2022-23లో 15.5 శాతానికి తగ్గిందని వ‌ర‌ల్డ్ బ్యాంక్ డేటా తెలిపింది.

    World Bank | కేంద్ర విధాన నిర్ణ‌యాలే కార‌ణం..

    కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం (BJP-led NDA government) తీసుకున్న విధాన నిర్ణ‌యాలే పేద‌రికం త‌గ్గుద‌ల‌కు కార‌ణ‌మైంది. గ‌త ప‌ద‌కొండేళ్ల‌లో తీసుకొచ్చిన అనేక ప‌థ‌కాలు కోట్లాది మందికి ప్ర‌యోజ‌న‌క‌రంగా మారాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలు గృహనిర్మాణం, శుభ్రమైన వంట ఇంధనం, బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణకు ప్రాప్యతను పెంచాయి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT), డిజిటల్ పేమెంట్స్‌ (digital payments), బలమైన గ్రామీణ మౌలిక సదుపాయాలు ప్ర‌జ‌ల‌కు వ‌రంగా మారాయి. 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికాన్ని జయించడంలో కేంద్ర ప్ర‌భుత్వ విధానాలు సహాయపడ్డాయి.

    More like this

    Moneylenders | బడా వడ్డీ వ్యాపారులపై చర్యలేవి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Moneylenders | వడ్డీ వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని నిజామాబాద్​ కమిషనరేట్​ పోలీసులు (Nizamabad...

    Nandipet | వెల్మల్​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ అందజేత

    అక్షరటుడు, నందిపేట్ ​: Nandipet | వెల్మల్(Velmal)​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ను మంగళవారం అందజేశారు. నందిపేట మండలం కేదారీశ్వర...

    Rohith Sharma | అర్ధ‌రాత్రి ఆసుప‌త్రికి వెళ్లిన రోహిత్ శ‌ర్మ‌.. అభిమానుల్లో ఆందోళ‌న‌, అస‌లు వాస్తవం ఇది!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohith Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం అర్ధరాత్రి ముంబయిలోని...