Homeలైఫ్​స్టైల్​World Asthma Day | ఆస్త‌మా.. జాగ్ర‌త్త సుమా..

World Asthma Day | ఆస్త‌మా.. జాగ్ర‌త్త సుమా..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : World Asthma Day | దీర్ఘ‌కాలంగా వేధించే రోగాల్లో diseases ఆస్త‌మా asthama ఒక‌టి. శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌తో problems బాధ ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతోంది. స‌రైన చికిత్స proper treatment పొంద‌లేక చ‌నిపోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండ‌డం ఆందోళ‌న కలిగిస్తోంది.

ప్ర‌ప‌ంచంలో 25 కోట్ల మందికి పైగా ఆస్త‌మా బాధితులు ఉన్నారు. మ‌న‌ దేశంలో సుమారు 2 కోట్ల మందికి పైగా ఆస్త‌మా బాధితులు ఉన్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) World Health Organization (WHO) అంచ‌నా. మ‌న దేశంలో 11 ఏళ్ల లోపు చిన్నారుల్లో నూటికి 5 నుంచి 15 మంది ఆస్తమా బారిన పడుతున్నారు. ఏటేటా వీరి సంఖ్య పెరుగుతుండ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌ను క‌ళ్ల‌కు క‌డుతోంది. నేడు ప్ర‌పంచ ఆస్త‌మా దినోత‌వ్సం World Asthma Day సంద‌ర్భంగా.. అస‌లు ఆస్త‌మా అంటే ఏమిటి.. ఎందుకు వ‌స్తుంది.. ఎలా నివారించాల‌నే అంశాలు మీకోసం..

World Asthma Day | దీర్ఘ‌కాలిక వ్యాధి..

దీర్ఘకాలిక శ్వాససంబంధ రుగ్మతల్లో ఆస్తమా ఒకటి. దీనిని ఉబ్బసం అని కూడా అంటారు. మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి lungs వెళ్లడానికి, బయటకు రావడానికి వాయు నాళాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల కండరాలు muscles వాచిపోవడం వల్ల అవి సన్నబడతాయి. దాంతో గాలి ప్రవాహానికి ఆటంకంగా మారుతుంది. గాలి వేగంగా పీల్చడం, వదలడం inhale and exhale air quickly ఇబ్బందికరంగా మారుతుంది. కాసేపు నడిచినా, చిన్న పని చేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది.

గొంతులో throat ఈల వేసినట్టుగా శబ్దం whistling sound వస్తుంది. ఛాతిలో బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. దీన్నే ఆస్త‌మా అని అంటారు. ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితులతో పాటు వంశపారంపర్యంగా ఆస్త‌మా asthama వ‌స్తుంద‌ని వైద్యులు Doctors చెబుతున్నారు. ధూమ‌పానం, మ‌ద్య‌పానం వ‌ల్ల కూడా వ‌చ్చే అవ‌కాశ‌ముంది. బర్గర్ల వంటి ఫాస్ట్‌ఫుడ్ పదార్థాలు fast food items ఆస్తమా asthama, చర్మవ్యాధులకు skin diseases కారణమవుతున్నాయని ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

World Asthma Day | నివార‌ణ

ఆస్త‌మా దీర్ఘ‌కాలిక వ్యాధి. దీని నివార‌ణ‌కు స‌రైన చికిత్స Proper treatment తీసుకోవాలి. విటమిన్ డీ vitamin D ఉండే పదార్థాలు ఎక్కువ తీసుకోవడం ద్వారా ఆస్తమా తీవ్రతను తగ్గించుకోవచ్చు. లక్షణాలు symptoms తీవ్రంగా ఉన్నప్పుడు తక్షణ ఉపశమనం పొందేందుకు రిలీవర్ మందులు వాడాలి. ఇవి వాయునాళం కండరాలను airway muscles వదులయ్యేలా చేస్తాయి. ఈ మందులను వేసుకునేందుకు ఇన్‌హేలర్ వెంటే ఉంచుకోవాలి. ప్రివెంటర్లు వాయునాళాల కండరాల వాపును తగ్గించి, శ్వాసకు ఇబ్బంది లేకుండా చేస్తాయి.

World Asthma Day | ప్రాణాల‌కు ముప్పు..

- డాక్ట‌ర్ వై. ప్రశాంత్, పల్మానాలాజీ, మెడికవర్ హాస్పిట‌ల్‌
– డాక్ట‌ర్ వై. ప్రశాంత్, పల్మానాలాజీ, మెడికవర్ హాస్పిట‌ల్‌

– డాక్ట‌ర్ వై. ప్రశాంత్, పల్మానాలాజీ, మెడికవర్ హాస్పిట‌ల్‌

ఆస్తమా దీర్ఘకాలిక వ్యాధి. సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోక‌పోతే ప్రాణాల‌కు ముప్పే. ఆస్తమా బాధితులు ఏటేటా పెరుగుతున్నారు. వ్యాధి ల‌క్ష‌ణాలను మొద‌టి ద‌శ‌లోనే గుర్తిస్తే చికిత్స ద్వారా సులువుగా న‌యం చేయ‌వ‌చ్చు. కానీ చాలా మంది తీవ్రత‌ పెరిగే వ‌ర‌కు గుర్తించ‌డం లేదు. వ్యాధి తీవ్ర‌త పెరిగాక ఆస్ప‌త్రుల చుట్టూ తిర‌గ‌డానికి బ‌దులు ముందుగానే గుర్తించి చికిత్స పొంద‌డం ఉత్త‌మం. శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు, రాత్రిపూట ఎక్కువ ద‌గ్గు రావ‌డం, గొంతు స‌మ‌స్య‌లు వంటివి అస్త‌మా ల‌క్ష‌ణాలు. వీటితో బాధప‌డేవారు వెంట‌నే డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించాలి.