అక్షరటుడే, భీమ్‌గల్: kammarpally | రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని కమ్మర్‌పల్లి ఏఎంసీ (Kammarpally AMC) ఛైర్మన్ పాలెపు నర్సయ్య అన్నారు.
మండలంలోని మెండోరలో (mendora) మంగళవారం నిర్వహించిన ఇందిరా శక్తి మహిళా (Indira Mahila Sakthi) సంబరాల్లో ఆయన మాట్లాడారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు, పెట్రోల్‌బంక్‌ల నిర్వహణ, యూనిఫాం తయారీ, తదితర బాధ్యతలు అప్పగిస్తోందన్నారు. అంతేగాక, మరెన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.
మహిళా సంఘ సభ్యులకు ప్రమాద బీమా, రుణ బీమా (Runa Bheema) వర్తింపజేస్తోందని, 35శాతం సబ్సిడీతో రుణాలు అందజేస్తోందన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి రమేష్, మండల అధ్యక్షుడు స్వామి, నాయకులు సురేందర్, నాగేంద్ర, ఐకేపీ ఏపీఎంలు రవీందర్, గంగారెడ్డి, సీసీలు, తదితరులు పాల్గొన్నారు.