అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad Bar Association | న్యాయవాదుల పెండింగ్ సమస్యలను త్వరలోనే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్ (Ponnam Ashok Goud) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నిజామాబాద్ నగరంలోని జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ (Health Insurance) పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచే విధంగా కృషి చేస్తామన్నారు.
Nizamabad Bar Association | దాడుల నిరోధక చట్టం..
న్యాయమూర్తులు, న్యాయవాదుల దాడుల నిరోధక చట్టాన్ని పటిష్ట పర్చడం, అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ (Advocate Welfare Fund)కు సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు కేటాయించేలా కృషి చేస్తానని అశోక్ గౌడ్ న్యాయవాదులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నిజామాబాద్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మామిళ్ల సాయిరెడ్డి, మాణిక్ రాజ్, సీనియర్ అడ్వకేట్లు దయాకర్ గౌడ్, రెంజర్ల సురేష్, ముత్యాల శ్యాం బాబు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.
