అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | బీడీ కార్మికుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయూ నాయకులు (IFTU Leaders) డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆర్మూర్ పట్టణంలోని మోడ్రన్ బీడీ కంపెనీ (Modern Beedi Company) ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి సూర్య శివాజీ మాట్లాడుతూ.. కంపెనీ యజమాన్యం కార్మికుల అమాయకత్వాన్ని నిరాక్షరాస్యతను ఆసరా చేసుకుని కార్మిక చట్టాలను తుంగలో తొక్కిందన్నారు.
Armoor | లేబర్ అధికారుల నిర్లక్ష్యం..
అదేవిధంగా లేబర్ అధికారులకు (Labour Officers) కంపెనీపై ఫిర్యాదు చేసి మూడు నెలలు గడుస్తున్నా యజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇప్పటికైనా కంపెనీ యజమాన్యం తమ మొండి వైఖరి వీడి రాజీనామా చేసిన కార్మికుల గ్రాట్యూటీ డబ్బులు (Gratuity Money) ఇవ్వాలని డిమాండ్ చేశారు. బకాయి ఉన్న బట్వాడాలు వెంటనే ఇచ్చి నెలనెలా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మికులతో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీడీ కార్మికులు సమీరా లక్ష్మీనర్సు, అరటి అనిత, అరస లక్ష్మి, బయ్యా అనూష, వేల్పూర్ చంద్రబాగ్ తదితరులు పాల్గొన్నారు.