అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | నమ్మకంగా పనిచేస్తున్నట్లుగా నమ్మించిన ఇద్దరు వర్కర్లు తమ యజమానినే మోసం చేశారు. తాము పనిచేసిన సిల్వర్ మర్చంట్ (Silver Merchant) వద్దే ఏకంగా 77 కిలోల వెండిని చోరీ చేశారు.
వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో (One Town SHO) రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కిషన్‌గంజ్ (Kishanganj) సమీపంలో ఉన్న శ్రీసాయి గోల్డ్ అండ్ సిల్వర్ మర్చంట్‌లో (Sri Sai Gold and Silver Merchant) విష్ణువర్ధన్, ప్రశాంత్‌లు మూడేళ్లుగా నమ్మకంగా పనిచేస్తూ వచ్చారు.
Nizamabad City | యజమానికి దుకాణానికే కన్నం వేసేందుకు ప్లాన్..
కాని వారిలో దుర్బుద్ధి పుట్టి యజమాని దుకాణానికే కన్నం వేసేందుకు ప్రణాళిక వేశారు. దీంట్లో భాగంగా విడతల వారీగా వెండిని చోరీ చేస్తూ వచ్చారు. అనుమానం వచ్చిన షాప్ యజమాని శివకుమార్ పాటిల్ ఇద్దరు వర్కర్లను వెండి దొంగలిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మొత్తం 77 కిలోల వెండిని వారు చోరీ చేసినట్లుగా గుర్తించారు. వెంటనే బాధితుడు శివకుమార్ వన్ టౌన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో వివరించారు.
