అక్షరటుడే, డిచ్పల్లి : Beedi Workers | నెలలో పనిదినాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI) ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డిచ్పల్లి శివాజీ కంపెనీ (Shivaji Company) ఎదుట సోమవారం కార్మికులు ఆందోళనకు దిగారు. అనంతరం కంపెనీ బ్రాంచ్ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటి మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా బీడీ కార్మికులకు నెలకు తొమ్మిది నుంచి పది రోజుల పని మాత్రమే కల్పిస్తున్నారన్నారు. దీంతో చేతినిండా పనిలేక బీడీ కార్మికులు (Beedi Workers) నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. కాబట్టి బీడీ యాజమాన్యం తక్షణం బీడీ కార్మికులకు 26 రోజుల పనిని కల్పించాలని మంచి నాణ్యమైన తునికి ఆకు అందజేయాలని డిమాండ్ చేశారు. నూతన పీఎఫ్ నంబర్లను ఇవ్వాలని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీడీ ఇండస్ట్రీ(Beedi Industry)పై జీఎస్టీ, టాక్స్ విపరీతంగా పెంచడంతో కార్మికులు నష్టపోతున్నారని ఆయన వాపోయారు.
Beedi Workers | బీడీ పరిశ్రమపై జీఎస్టీ తొలగించాలి..
బీడీ పరిశ్రమపై జీఎస్టీ, టాక్స్ తొలగించాలని ప్రభుత్వాన్ని సీపీఐఎంల్ నాయకులు(CPIML Leaders) డిమాండ్ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) అధికారంలోకి రాగానే జీవన భృతిని రూ.4వేలకు పెంచుతామని చెప్పి ఇప్పటివరకు చేయలేదన్నారు. తక్షణం బీడీ ఇండస్ట్రీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI) ఏరియా కార్యదర్శి కిషన్, జిల్లా నాయకులు మురళి, కమీషన్‌దారులు నర్సయ్య, సాయినాథ్ సుదర్శన్, శ్రీధర్ గణేష్, రవి, కార్మికులు లక్ష్మి, సుజాత, నరసవ్వ, గౌతమి, జమున, సుమారు 400 మంది పలు గ్రామాల బీడీ కార్మికులు పాల్గొన్నారు.