అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Municipal Corporation | మున్సిపల్ సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఆస్కారం ఉండదని కార్పొరేషన్ కమిషనర్ దిలీప్‌కుమార్ అన్నారు. ‘తెలంగాణ రైజింగ్’ (Telangana Rising) కార్యక్రమంలో భాగంగా నగరంలోని సర్కిల్–5 పరిధిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. డీ–52 కెనాల్, కంఠేశ్వర్ బైపాస్(Kanteshwar Bypass), పూలాంగ్, ఐటీఐ గ్రౌండ్, ఆర్యనగర్ తదితర ప్రాంతంలో సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమంలో శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఏరియా జవాన్లు, కార్మికులు చురుకుగా పాల్గొన్నారు.