అక్షరటుడే, కామారెడ్డి: Gampa Govardhan | మొదటి విడత జరిగే సర్పంచ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ (Former MLA Gampa Govardhan) నాయకులకు సూచించారు. కామారెడ్డి పట్టణంలోని (Kamareddy town) తన నివాసంలో గురువారం నియోజకవర్గంలోని దోమకొండ, మాచారెడ్డి, భిక్కనూరు, రాజంపేట, పాల్వంచ, బీబీపేట్ మండలాల బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ ప్రచారం నిర్వహించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల (assembly elections) ముందు ఇచ్చిన వాగ్దానాలను ప్రజల ముందు పెడుతూ మద్దతు కూడా గట్టాలని సూచించారు. ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల పక్షాన పోరాడాలని తెలిపారు. ఈ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్ స్థానాలను గెలవాలని, దానికోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో సీనియర్ నాయకులు ప్రేమ్‌కుమార్, మినుకూరి రాంరెడ్డి, గోపి గౌడ్, మాచారెడ్డి మండలాధ్యక్షుడు బాలచంద్రం, మధుసూదన్ రావు, బల్వంత్ రావు, రాజా గౌడ్, బాలమణి, గూడెం బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.