అక్షరటుడే, భీమ్గల్ : BJP : స్థానిక సంస్థల ఎన్నికల్లో local body elections విజయమే లక్ష్యంగా పని చేయాలని ఎన్నికల కన్వీనర్ ప్రభారి సంతోష్ రెడ్డి పిలుపునిచ్చారు. భీమ్గల్ మండలం పురాణీపేట్ గ్రామంలో శుక్రవారం భారతీయ జనతా పార్టీ Bharatiya Janata Party మండల అధ్యక్షుడు ఆరే రవీందర్ ఆధ్వర్యంలో మండల కార్యశాలను నిర్వహించారు.
కార్యక్రమానికి విచ్చేసిన ప్రభారీ సంతోష్ రెడ్డి సంస్థల ఎన్నికలపై మార్గనిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధానాన్ని మండల పదాధికారులకు వివరించారు. ఈ సందర్భంగా ఆరే రవీందర్ మాట్లాడుతూ.. జిల్లా పార్టీ ఆదేశాల మేరకు మండల కార్యశాల సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
BJP : పార్టీ బలంగా ఉంది..
బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలంలో బీజేపీ పార్టీ చాలా బలంగా ఉందని రవీందర్ అన్నారు. ప్రతి కార్యకర్త తనకే టికెట్ వచ్చినట్టుగా భావించి ఎన్నికల్లో పనిచేసి జడ్పీటీసీ ZPTC, ఎంపీపీ MPP, సర్పంచులను Sarpanch seats మెజార్టీ స్థానాలలో గెలిపించుకొని ప్రధాని నరేంద్రమోదీకి కానుక ఇవ్వాలన్నారు.
కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తే భీమ్గల్ జడ్పీటీసీ స్థానంతో సహా మెజారిటీ ఎంపీటీసీలను గెలిపించుకొని ఎంపీపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా నాయకులు యోగేశ్వర నర్సయ్య, మండల ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు తోట గంగాధర్, సీనియర్ నాయకులు ములిగె మహిపాల్, సంధ్య రాజు, గంగాధర్ గౌడ్, పార్థసారథి, నాగార్జున రెడ్డి, బద్దం సంజయ్ కొడిగెల శ్రీనివాస్, కొట్టాల అశోక్, గాడి వేణు, శక్తి కేంద్ర ఇన్ఛార్జులు, మండల పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.