అక్షరటుడే, భీమ్‌గల్ : Bheemgal | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) అన్నారు. ఇటీవల భారతీయ జనతా పార్టీ యువమోర్చా మండల అధ్యక్షుడిగా నియమితులైన శెట్టి ప్రేమ్ చందర్, పార్టీ మండల అధ్యక్షుడు ఆరే రవీందర్ (Party Mandal President Aare Ravinder) శనివారం ఎంపీ అర్వింద్‌ను కలిశారు.
మండలంలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి చురుకుగా తీసుకెళుతున్నారని ఈ సందర్భంగా వారిని ఎంపీ అభినందించారు. మండలంలో ఇంకా పార్టీని బలోపేతం చేస్తూ యువతను ఏకతాటిపైకి తీసుకురావాలన్నారు. దేశం కోసం ధర్మం కోసం అన్న నినాదంతో ముందుకు సాగాలని సూచించారు. వారి వెంట బీజేపీ మండల ఉపాధ్యక్షులు ఓరుగంటి కిషన్, మండల ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ, నాయకులు తదితరులున్నారు.