అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి మున్సిపాలిటీలో Kamareddy Municipality పైసలిస్తే గానీ పనులు కావడం లేదు. ప్రజలు నేరుగా పనుల కోసం తిరిగితే పట్టించుకోని అధికారులు.. దళారులను కలవగానే క్షణాల్లో పనులు పూర్తి చేసి పడుతున్నారు. మాముళ్లు ఇవ్వనిదే దస్త్రాన్ని ముందుకు కదపడం లేదు. కొందరు అధికారులు ఏకంగా ప్రైవేటు వ్యక్తులను నియమించుకోవడం గమనార్హం. ఇంటి అనుమతులు మొదలు ప్రతీ పనికి పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం అంటేనే అవినీతి కేరాఫ్‌గా మారింది. ఒక వైపు పట్టణ ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే వాటి గుర్తించి పట్టించుకోవట్లేదు. కానీ, ఏ పని వచ్చినా ప్రైవేటు వ్యక్తులను వెంటపెట్టుకుని వసూ ళ్లకు పాల్పడుతున్నారు. కొత్తగా పలువురు మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కనెక్షన్ ఇవ్వడానికి కూడా పలువురు సిబ్బంది డబ్బులు డిమాం డ్ చేస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి తనకు నల్లా కనెక్షన్ కావాలని దరఖాస్తు చేసుకు న్నాడు. సదరు అధికారి నేరుగా డబ్బులు అడగకుండా ఫలానా వ్యక్తిని కలవాలని సూచించాడు. అధికారి చెప్పిన వ్యక్తిని కల వగా రూ.5 వేలిస్తేనే పని పూర్తిచేసి పెట్టాడు.
Kamareddy | ఇంటి నిర్మాణ పనుల్లోనూ..
పట్టణంలో కొత్తగా ఇల్లు కట్టుకున్న వారు మున్సిపాలిటీ చుట్టూ తిరగాల్సి వస్తోంది. దరఖాస్తు సమయంలో అన్నిపత్రాలు సమ ర్పించినా ఏదో సాకుతో అనుమతి నిరాకరి స్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మధ్యవర్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. పలువురు ప్రైవేటు ఇంజినీర్లు మధ్యవర్తు లుగా మారి అనుమతులు ఇప్పిస్తున్నారు.
Kamareddy | రూ.లక్షల్లో వసూళ్లు
భవన నిర్మాణ అనుమతుల కోసం రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు న్నాయి. అనుమతుల సమయంలో క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్తున్న వారు సంబం ధిత స్థలం, భవన నిర్మాణం విలువను లెక్కలేసి మరి లంచం డిమాండ్ చేస్తుం డడం కొసమెరుపు.
Kamareddy | ఎమ్మెల్యే చెప్పినా మారని తీరు
ఇటీవల జరిగిన మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే కేవీఆర్ అధికారులపై తీవ్రస్థాయి లో మండిపడ్డారు. ఎవరేం చేస్తున్నారో తనకు తెలుసునని, తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా అధికారులు, సిబ్బందిలో ఎలాంటి మార్పు రావడం లేదని తెలుస్తోంది. ప్రతీ పనికి డబ్బులు డిమాండ్ చేస్తున్న విషయం ఉన్న తాధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.