అక్షరటుడే, బాన్సువాడ : Enugu Ravinder Reddy | నూతనంగా ఎన్నికైన పంచాయతీ పాలకవర్గాలు (panchayat governing bodies) ప్రజలతో మమేకమై, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి (Enugu Ravinder Reddy) అన్నారు. బాన్సువాడ మండలం దేశాయిపేట సర్పంచ్‌గా ఎన్నికైన భునేకర్ జ్యోతి ప్రకాష్, ఆరుగురు వార్డు మెంబర్లు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. వారితో ఎంపీడీవో ఆనంద్ ప్రమాణం చేయించారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏనుగు రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పాలకవర్గాలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పారదర్శక పాలన అందించాల్సిన బాధ్యత నూతన పాలకవర్గాలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.