Homeక్రీడలుWomen's World Cup | ఉమెన్స్​ వరల్డ్​ కప్​ షెడ్యూల్​ విడుదల

Women’s World Cup | ఉమెన్స్​ వరల్డ్​ కప్​ షెడ్యూల్​ విడుదల

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Women’s World Cup | ఉమెన్స్ వన్​డే వరల్డ్ కప్ (Women’s One Day World Cup) షెడ్యూల్​ను ఐసీసీ (icc) తాజాగా రిలీజ్ చేసింది. భారత్(bharat), శ్రీలంక(srilanka) వేదికగా ఈ ఏడాది వరల్డ్ కప్ జరగనుంది.

సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరిగే టోర్నీకి సంబంధించిన షెడ్యూల్​ను ఐసీసీ ప్రకటించింది. ఈ మ్యాచ్​లు భారత్​లోని బెంగళూరు, గుహవాటి, ఇండోర్, విశాఖపట్నం, శ్రీలంకలోని కొలంబోలో జరగనున్నాయి.

కాగా.. సెమీ ఫైనల్ – 1 మ్యాచ్ గుహవటి లేదా కొలంబోలో, సెమీ ఫైనల్ –2 బెంగళూరులో జరగనుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్– 2న నిర్వహించనున్నారు. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ భారత్ లో ఆడడానికి అంగీకరించలేదు. ఈ క్రమంలో పాకిస్తాన్ మ్యాచ్​లు శ్రీలంకలో జరగనున్నట్లు తెలిసింది. పాకిస్తాన్ ఒకవేళ ఫైనల్​కు చేరితే ఫైనల్ వేదిక కొలంబోకు మార్చనున్నారు.

Must Read
Related News