ePaper
More
    Homeజిల్లాలుకరీంనగర్Collector Pamela Satpathi | మహిళ సంక్షేమమే 'శుక్రవారం సభ' ధ్యేయం

    Collector Pamela Satpathi | మహిళ సంక్షేమమే ‘శుక్రవారం సభ’ ధ్యేయం

    Published on

    అక్షరటుడే, కరీంనగర్ : Collector Pamela Satpathi | మహిళల సంక్షేమమే ‘శుక్రవారం సభ’ (Friday meeting) ప్రధాన ధ్యేయమని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి (Collector Pamela Satpathi) అన్నారు. కరీంనగర్ లోని దుర్గమ్మగడ్డ అంగన్ వాడీ కేంద్రంలో (Anganwadi Center) మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్ వాడీ కేంద్రాల్లో చదువుతో పాటు పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారన్నారు. నూతన సిలబస్ తో, ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లతో అంగన్ వాడీల్లో బోధిస్తున్నామని పేర్కొన్నారు. పిల్లలు ఎత్తుకు తగిన బరువుతో ఆరోగ్యంగా ఉండేలా అంగన్ వాడీ కార్యకర్తలు (Anganwadi workers) శ్రద్ధ తీసుకుంటారని తెలిపారు. మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలందరినీ అంగన్ వాడీలకు పంపించాలని సూచించారు. అనంతరం చిన్నారులకు కోడిగుడ్డు బిర్యానీతో మధ్యాహ్నం భోజనం వడ్డించారు.

    READ ALSO  Petrol Bunk | బైక్​లో పెట్రోల్​ పోస్తుండగా మంటలు.. తప్పిన ప్రమాదం

    అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు (government hospitals), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రత్యేక క్యాంపుల్లో ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా మహిళలకు 50 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ (Municipal Commissioner Prapul Desai), జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, సీడీపీవో సబిత, వైద్యాధికారులు సనా, సూపర్ వైజర్ రేణుక, ఆర్పీలు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

    Latest articles

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. భారీ గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. గురువారం సెషన్‌లో యూఎస్‌,...

    Today Gold Price | కాస్త శాంతించిన బంగారం ధ‌ర‌లు.. ఇదే మంచి తరుణం!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : గ‌త కొద్ది రోజులుగా బంగారం Gold ధ‌ర‌లు ప‌రుగులు పెడుతుండ‌టం...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    More like this