ePaper
More
    Homeక్రీడలుWomen T20 World Cup | ఉమెన్స్ టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్ విడుద‌ల‌.....

    Women T20 World Cup | ఉమెన్స్ టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్ విడుద‌ల‌.. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఎప్పుడు..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Women T20 World Cup | మహిళల టీ-20 ప్రపంచకప్ 2026 (T-20 World Cup 2026) షెడ్యూల్‌ను గురువారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(International Cricket Council) విడుదల చేసింది. ఇంగ్లండ్ వేదికగా 2026 జూన్ 12వ తేదీన ప్రారంభం కానున్న ఈ టోర్న‌మెంట్ చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. తొలిసారిగా ఈ టోర్నమెంట్‌లో 12 జట్లు పాల్గొంటున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్‌లతో పాటు గ్లోబల్ క్వాలిఫయర్స్ ఫలితాల ఆధారంగా మరో నాలుగు జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తాయి.

    Women T20 World Cup | షెడ్యూల్ విడుద‌ల‌..

    జూన్ 12వ తేదీన తొలి మ్యాచ్ ఆతిథ్య ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరగనుంది. టోర్నమెంట్‌లో (T-20 World Cup 2026) గ్రూప్‌-1లో ఇండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్థాన్(Pakistan) ఉన్నాయి. గ్లోబల్ క్వాలిఫయర్‌లో అర్హత సాధించిన జట్లు ఈ గ్రూప్‌లో చోటు దక్కించుకుంటాయి. లీగ్ దశలో జూన్ 14 నుంచి 28 వరకూ ఇండియా ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో తొలి మ్యాచ్‌లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఇక టోర్నమెంట్ సెమీఫైనల్స్ జూన్ 30, జూలై 2 తేదీల్లో ఓవెల్ వేదికగా జరుగుతాయి. లార్డ్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

    Women T20 World Cup | టి-20 ప్రపంచకప్-2026 ఇండియా షెడ్యూల్ చూస్తే..

    • జూన్ 14 : ఇండియా వర్సెస్ పాకిస్థాన్, ఎడ్జ్‌బాస్టన్
    • జూన్ 17 : ఇండియా వర్సెస్ క్వాలిఫయర్, హెడ్డింగ్లే,
    • జూన్ 21 : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా, ఓల్డ్ ట్రాఫర్డ్,
    • జూన్ 25 : ఇండియా వర్సెస్ క్వాలిఫయర్, ఓల్డ్ ట్రాఫర్డ్,
    • జూన్ 28 : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, లార్డ్స్ లో మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

    పురుషుల జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ద‌క్కించుకోగా.. ఈ సారి మ‌హిళ‌లు కూడా క‌ప్ కొట్టాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అంతేకాదు దాయాదుల జ‌ట్టు పాకిస్తాన్‌ Pakistanని మ‌ట్టిక‌రిపించాల‌ని కోరుతున్నారు.

    More like this

    High Court | హైకోర్టు సంచ‌ల‌న తీర్పు.. గ్రూప్‌1 ప‌రీక్ష‌లు మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని ఆదేశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | గ్రూప్‌1 ప‌రీక్ష‌లపై తెలంగాణ హైకోర్టు మంగ‌ళ‌వారం సంచ‌ల‌న తీర్పు వెలువరించింది....

    Nepal Government | వెన‌క్కి త‌గ్గిన నేపాల్ ప్ర‌భుత్వం.. సోష‌ల్ మీడియాపై నిషేధం ఎత్తివేత‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Government | నేపాల్ ప్ర‌భుత్వం వెన‌క్కు త‌గ్గింది. సోష‌ల్ మీడియా సైట్‌లపై విధించిన...

    Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు కొనసాగుతున్న వరద.. 8 గేట్ల ఎత్తివేత

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్​సాగర్​ (SRSP)కు ఎగువ నుంచి...