అక్షరటుడే, వెబ్‌డెస్క్:Vana Mahotsavam | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) సంబంధించి త్వరలో మహిళా రిజర్వేషన్లు(Womens Reservation) అమలులోకి వస్తాయన్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవం(Vana Mahotsavam) కార్యక్రమాన్ని సీఎం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి రుద్రాక్ష మొక్కను నాటారు. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.
సీఎం(CM Revanth Reddy) మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎమ్మెల్యే సీట్లు 153కు పెరుగుతాయని అందులో 51 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయని పేర్కొన్నారు. ఇల్లు నడిపుతున్న మహిళలు రాజ్యాన్ని కూడా నడపగలరన్నారు. మహిళా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
Vana Mahotsavam | ప్రతి ఇంట్లో రెండు మొక్కలు నాటాలి
పిల్లలను పెంచి పెద్ద చేసే తల్లులకు మొక్కలు పెంచడం కష్టం కాదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతి ఇంటి పెరటిలో మహిళలు రెండు మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. వనమే మనం.. మనమే వనం అని ఆయన అన్నారు. మనం చెట్లను కాపాడితే అవి మనల్ని కాపాడుతాయని పేర్కొన్నారు. ఈ ఏడాది అటవీ శాఖ(Forest Department) ఆధ్వర్యంలో 18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం కోరారు.
Vana Mahotsavam | మహిళలను కోటీశ్వరులను చేస్తాం
రాష్ట్రంలోని మహిళలను మహిళా సంఘాల్లో చేర్చి కోటీశ్వరులను చేస్తామని సీఎం పేర్కొన్నారు. కోటీ మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ యూనిట్లు(Solar units) ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పాటు మహిళా సంఘాల ఆధ్వర్యంలో బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చామన్నారు.
బీఆర్ఎస్ హయాంలో మహిళలను పట్టించుకోలేదన్నారు. ఐదేళ్లు మంత్రివర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళల ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడుతామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో మహిళలు కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు.