Homeజిల్లాలుకామారెడ్డిBanswada | తాగునీటి కోసం మహిళల రాస్తారోకో

Banswada | తాగునీటి కోసం మహిళల రాస్తారోకో

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ : Banswada | తాగునీటి(Drinking Water) కోసం మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మండలంలోని కొత్తబాది గ్రామంలో నీటి కష్టాలు తీర్చాలంటూ మహిళలు సోమవారం రాస్తారోకో(Rastaroko) నిర్వహించారు. గ్రామంలో కొంతకాలంగా మంచినీరు సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకోతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకొని వారిని సముదాయించారు