Homeజిల్లాలుకామారెడ్డిMahammad Nagar | తాగునీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్థులు

Mahammad Nagar | తాగునీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్థులు

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్: Mahammad Nagar | తాగునీటి ఇబ్బందులు తీర్చాలని మహిళలు రోడ్డెక్కారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో వారం రోజులుగా బుడగ జంగాల కాలనీ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నిరసన వ్యక్తం చేస్తూ శనివారం మహిళలు బోధన్​-హైదరాబాద్​ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు.

దీంతో ఇరువైపులా పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై శివకుమార్ (SI Shiva kumar) సంఘటనా స్థలానికి చేరుకొని మహిళలను సముదాయించారు. పంచాయతీ అధికారులతో మాట్లాడి తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.