Homeక్రీడలుWomen Team India | జ‌య‌కేత‌నం ఎగుర‌వేసిన టీమిండియా.. ద‌ర్జాగా ఫైన‌ల్‌లోకి

Women Team India | జ‌య‌కేత‌నం ఎగుర‌వేసిన టీమిండియా.. ద‌ర్జాగా ఫైన‌ల్‌లోకి

Women Team India | మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమిండియా 52 ఏళ్ల నిరీక్షణకు తెరదించేందుకు ఒక్క అడుగు దూరంలో ఉంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Women Team India | మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (ODI World Cup 2025) టీమిండియా Team India చరిత్ర సృష్టించింది. 52 ఏళ్ల నిరీక్షణకు తెరదించేందుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఒక్క అడుగు దూరంలో నిలిచింది. గురువారం నవీ ముంబై వేదికగా జరిగిన రసవత్తర సెమీఫైనల్‌లో Semi Finals భారత్ డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో అద్వితీయ విజయానికి నాంది పలికింది. 134 బంతుల్లో 14 ఫోర్లతో అజేయంగా 127 పరుగులు చేసి టీమిండియాని విజయపథంలో న‌డిపించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (89 పరుగులు, 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుతంగా ఆడి కీలక భాగస్వామ్యాన్ని అందించింది.

Women Team India | ఆస్ట్రేలియా భారీ స్కోరు

ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా Australia జట్టు 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (119), ఎలిస్ పెర్రీ (77), అష్లే గార్డ్‌నర్ (63) ధాటిగా ఆడారు.

కానీ భారత బౌలర్లు సమష్టిగా రాణించారు. శ్రీ చరణి (2/49), దీప్తి శర్మ (2 వికెట్లు), క్రాంతి గౌడ్, రాధ యాదవ్, అమన్‌జోత్ కౌర్ తలో వికెట్ తీసి ఆస్ట్రేలియాను అడ్డుకున్నారు.

339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ ప్రారంభంలో ఒత్తిడిని ఎదుర్కొంది. స్మృతి మంధాన (17) మరియు షెఫాలీ వర్మ (10) త్వరగా ఔటవడంతో జట్టు ఇబ్బందుల్లో పడింది.

కానీ జెమీమా–హర్మన్‌ప్రీత్ జంట భీకర భాగస్వామ్యంతో భారత్‌ను గెలుపు దిశగా నడిపించింది.మూడో వికెట్‌కు ఇద్దరూ కలిసి 167 పరుగుల విలువైన భాగస్వామ్యం సాధించారు.

హర్మన్‌ప్రీత్ ఔటైన తర్వాత దీప్తి శర్మ (22), రిచా ఘోష్ (18) కూడా తోడయ్యారు. చివర్లో అమన్‌జోత్ కౌర్ రెండు చక్కని బౌండరీలతో విజయం సాధించింది. భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌లో ఘోర తప్పిదాలు చేసింది. జెమీమా Jemima ఇచ్చిన మూడు సునాయస క్యాచ్‌లను నేలపాలు చేయడంతో విజయం చేజారింది.

ఫీల్డింగ్‌లో ఆత్మవిశ్వాసం కోల్పోవడం ఆస్ట్రేలియా ఓటమికి ప్రధాన కారణమైంది. ఈ విజయంతో మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేధించిన జట్టుగా టీమిండియా నిలిచింది.

జెమీమా అజేయ శతకం, హర్మన్‌ప్రీత్ సూప‌ర్‌ ఇన్నింగ్స్‌తో భారత్ ద‌ర్జాగా ఫైన‌ల్‌లోకి అడుగుపెట్టింది. ఆదివారం భారత్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

నవీ ముంబై వేదికగా జరగనున్న ఫైనల్‌లో టీమిండియా టైటిల్ కోసం బరిలో దిగుతుంది. హర్మన్‌సేన గెలిస్తే ఇది భారత్ మహిళా క్రికెట్ చరిత్రలో మొదటి వన్డే ప్రపంచకప్ టైటిల్ అవుతుంది