Homeక్రీడలుWomen Team India | మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు హ్యాట్రిక్ ఓటమి.. సెమీస్‌కి చేరే...

Women Team India | మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు హ్యాట్రిక్ ఓటమి.. సెమీస్‌కి చేరే ఛాన్స్ ఎలా అంటే..!

Women Team India | ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. ఆదివారం ఇందోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా చివరి వరకు పోరాడినా విజయాన్ని అందుకోలేకపోయింది

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Women Team India | ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. ఆదివారం ఇందోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా చివరి వరకు పోరాడినా విజయాన్ని అందుకోలేకపోయింది.

మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో టీమిండియాకు India వరుసగా మూడో ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లాండ్ చేతిలో భారత్ కేవలం నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమితో భారత్ సెమీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. మరోవైపు, ఇంగ్లాండ్ టోర్నీలో నాలుగో విజయాన్ని నమోదు చేస్తూ సెమీస్‌కు అర్హత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాయి.టోర్నీ ఆరంభంలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో ఓడిన తర్వాత ఇంగ్లాండ్‌తో జ‌రిగిన‌ మ్యాచ్‌లోనూ టీమిండియా తడబాటుకు గురైంది.

Women Team India | గెలిచే మ్యాచ్‌లో ఓట‌మి..

ఒక దశలో సులభంగా విజయం అందుకోవచ్చని అనిపించిన భారత్ చివర్లో పూర్తిగా నిరాశ‌ప‌రిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. ఆ తరువాత 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మంచి ఆరంభాన్ని అందుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70) మరియు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (88) అద్భుతంగా ఆడుతూ జట్టును 167/2 స్థాయికి చేర్చారు. కానీ ఈ దశలోనే ఇంగ్లాండ్ England బౌలర్లు తిరిగి బలంగా పుంజుకుని కీలక వికెట్లు తీసి భారత్‌పై ఒత్తిడి తెచ్చారు. దీప్తి శర్మ (57 బంతుల్లో 50 పరుగులు) చివరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. చివరి 10 ఓవర్లలో భారత్‌కు అవసరమైన 62 పరుగులు సాధించలేకపోయింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 284 పరుగులకే పరిమితమై, కేవలం నాలుగు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

ఈ విజయంతో ఇంగ్లాండ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరి సెమీ ఫైనల్‌లోకి Semi Final దూసుకెళ్లింది. మరోవైపు, తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ వరుసగా మూడు ఓటములతో సెమీస్ దారిని కష్టతరం చేసుకుంది. మిగిలిన మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఇప్పుడు టీమిండియాకు ఏర్పడింది. టీమిండియా సెమీస్ చేరాలంటే చాలా సింపుల్. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. అలా గెలిస్తే భారత్ ఖాతాలో 8 పాయింట్లు చేరతాయి. మరోవైపు, న్యూజిలాండ్ భారత్ చేతిలో ఓడిపోయి ఇంగ్లండ్‌పై గెలిచినా, ఆ జట్టు ఖాతాలో కేవలం 6 పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఈ పరిస్థితిలో భారత్ నేరుగా సెమీస్ బెర్త్ సాధిస్తుంది.అయితే భారత్ కివీస్ చేతిలో ఓడిపోతే పరిస్థితి కొంత క్లిష్టంగా మారుతుంది. అప్పుడు భారత జట్టు సెమీస్ అర్హత కోసం ఇంగ్లండ్ ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. న్యూజిలాండ్ చివరి మ్యాచ్‌లో ఓడిపోవాలి, అదే సమయంలో భారత్ బంగ్లాదేశ్‌పై విజయం సాధించాలి. అలా అయితే భారత్, కివీస్ రెండింటికీ చెరో 6 పాయింట్లు వస్తాయి. అలాంటి సమయంలో ఎవరు ఎక్కువ విజయాలు సాధించారనే అంశం ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటారు. భారత్ మూడు విజయాలు సాధిస్తే, కివీస్ కేవలం రెండు మాత్రమే గెలిచినట్లయితే, భారత్ సెమీస్‌కు అర్హత పొందుతుంది. అయితే ఈ సీనారియో కొంచెం కఠినమైనదే.