అక్షరటుడే, ఇందూరు: Seva Bharathi | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సేవాభారతి ప్రధాన వక్త వాసు అన్నారు. సేవా భారతీయ ఆధ్వర్యంలో బోర్గాంలో (Borgam) శుక్రవారం మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ (Free computer training) కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆయా అంశాల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. నిరంతరం దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. సేవాభారతి నిర్వహించే కార్యక్రమాలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, మాధవస్వారక సమితి అధ్యక్షుడు కృష్ణారెడ్డి, విభాగ్ సేవ ప్రముఖ వేణు, నర్సారెడ్డి, శిక్షకురాలు భవాని తదితరులు పాల్గొన్నారు.