అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal | మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఐకేపీ ఏపీఎం ప్రమీల సూచించారు. మంగళవారం మండలంలోని పిప్రి (Pipri) గ్రామంలో రేణుకామాత గ్రామ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
మహిళా సంఘాల్లోని సభ్యులు ప్రభుత్వం అందించే రుణాలను పొంది, ఆర్థికంగా వృద్ధి చెందాలన్నారు. అలాగే ఇందిరా మహిళా శక్తిలో (Indira Mahila Shakthi) భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను, ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో కమ్యూనికేషన్ కో–ఆర్డినేటర్ గడాల రఘుపతి, మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మి, శిరీష, వీవోఏ నిరోష, లక్షణ, మహిళా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.