అక్షరటుడే, ఇందూరు: Food festival | పొదుపు సంఘాల మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగాలని నగరపాలక సంస్థ(Municipal Corporation) కమిషనర్ దిలీప్ కుమార్ అన్నారు. శనివారం నగరపాలక సంస్థ మెప్మా(Mepma) సంయుక్త ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. నగరంలోని ఆయా మహిళా సంఘాల ప్రతినిధులు, వీధి వ్యాపారులు రకరకాల తినుబండారాలను విక్రయించారు.
Food festival | మహిళలు ఆర్థికంగా ఎదగాలి

అక్షరటుడే, బోధన్: స్వయం సహాయక గ్రూపులు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Bodhan Sub-Collector Vikas Mahato) సూచించారు. బోధన్ మున్సిపాలిటీ (Bodhan Municipality) ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సబ్ కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, మెప్మా ఇన్ఛార్జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.