అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | పట్టణంలోని వైశ్యభవన్ (Vyshya Bhavan)లో మహిళలు భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవానికి తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మహిళలు సీతారాముల పాటలు పాడుతూ చేతితో వడ్ల గింజలను ఒలుస్తున్నారు.
Yellareddy | 2026లో కళ్యాణం కోసం..
ఈ సందర్భంగా మహిళ ప్రతినిధులు పడిగల రమాదేవి మాట్లాడుతూ.. 2026లో భద్రాద్రి సీతారాముల కల్యాణం (Bhadradri Sitarama Kalyanam) కోసం హైదరాబాద్ కొత్తపేట అష్టలక్ష్మీ ఆలయం (Ashtalakshmi Temple) నుంచి నిర్వాహకులు శ్రీనివాస్ గుప్తా అర కిలో సన్న వడ్లను ఎల్లారెడ్డికి పంపించారన్నారు. ఈ వడ్లను స్థానిక మహిళలు చేతితో ఒలిచి అక్షింతలు సిద్ధం చేసి రెండు రోజుల్లో హైదరాబాద్ (Hyderabad)కు పంపిస్తామన్నారు. తమకు అక్షింతలు ఒలిచే అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.