అక్షరటుడే, కామారెడ్డి : Women Blue Colt | జిల్లాలో మహిళా బ్లూ కోల్ట్ విధులు ప్రారంభించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) తెలిపారు. బ్లూ కోల్ట్ విధులను శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లూ కోల్ట్(Women Blue Colt) విధులు నిర్వర్తించే మహిళా పోలీసులు స్వీయ రక్షణ పాటించాలని సూచించారు.
హెల్మెట్ ధరించి వాహనాన్ని జాగ్రత్తగా నడుపుతూ నేర నియంత్రణకు, 100 కాల్స్‌కు తక్షణం స్పందించాలన్నారు. మహిళా పోలీసులతో కూడిన బ్లూ కోల్ట్ విధులను కామారెడ్డి(Kamareddy), దేవునిపల్లి, భిక్కనూరు, బాన్సువాడ, ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ల(Yellareddy Police Stations)లో అమలు చేస్తున్నామన్నారు. వారి విధులను శుక్రవారం లాంఛనంగా ప్రారంభించినట్లు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తరుణంలో ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. తొలుత కామారెడ్డి జిల్లాలోని ఐదు పోలీస్ స్టేషన్లలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, కామారెడ్డి, సదాశివనగర్ ఇన్ స్పెక్టర్లు నవీన్, కృష్ణ, సంతోష్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు