- Advertisement -
HomeUncategorizedBengaluru | మహిళ మృతదేహం కాళ్లను మెడకు కట్టి.. చెత్త లారీలో పడేసి.. బెంగళూరులో దారుణం

Bengaluru | మహిళ మృతదేహం కాళ్లను మెడకు కట్టి.. చెత్త లారీలో పడేసి.. బెంగళూరులో దారుణం

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bengaluru : బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. చెత్త లారీలో ఓ మహిళ మృతదేహాన్ని పడేశారు. అదీనూ ఆ మృతదేహం కాళ్లను మెడకు కట్టేసి చెత్తలారీలో పడేయడం గమనార్హం. చన్నమ్మనకెరె స్కేటింగ్ గ్రౌండ్ Channammanakere skating ground సమీపంలో ఈ ఘటన వెలుగుచూసింది.

Bengaluru : దారుణంగా కట్టేసి..

పారిశుద్ధ్య కార్మికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హత్య కేసుపై దర్యాప్తు చేపట్టారు. మృతురాలి కాళ్లు ఆమె మెడకు కట్టి, శరీరాన్ని గోనెలో చుట్టి ఉంచారని పోలీసులు తెలిపారు. మృతురాలి వయసు 25 నుంచి 35 మధ్య వయసు ఉంటుందని తెలుస్తోంది.

- Advertisement -

మొదట ఆ అసాధారణంగా బరువు బ్యాగును గమనించిన స్థానికుడు BBMP సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం చేరవేశారు. మహిళ వేరే చోట చంపబడి ఉండవచ్చని జాయింట్ కమిషనర్ సీవీ వంశీకృష్ణ తెలిపారు. ఆ బ్యాగును తెల్లవారుజామున 1 నుంచి 3 గంటల సమయంలో చెత్త వాహనంలో పడేసినట్లు తెలుస్తోందన్నారు.

Bengaluru : అత్యాచారం జరిగిందా..

CCTV ఫుటేజీలో అర్ధరాత్రి తర్వాత ఆటోరిక్షాలో వచ్చిన కొందరు మహిళ మృతదేహం ఉన్న బ్యాగును వదిలివెళ్లడాన్ని గుర్తించారు. మృతదేహంపై లోదుస్తులు లేకపోవడంతో అత్యాచారానికి గురైనట్లు అనుమానిస్తున్నారు. మృతదేహంపై టీ-షర్ట్, ప్యాంటు ధరించి ఉంది. పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చాకే మరణానికి గల కారణాన్ని నిర్ధారించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. చెన్నమ్మనకెరె అచుకట్టు పోలీస్ స్టేషన్‌లో దీనికి సంబంధించిన కేసు నమోదు అయింది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News