అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad City | నగరంలోని బస్ డిపో వెనక ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఎస్‌హెచ్‌వో రఘుపతి (SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న డిపో పక్కన దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి పరిశీలించగా ఓ మహిళ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
Nizamabad City | అత్యంత రద్దీ ప్రదేశంలో..
నిత్యం వేల సంఖ్యలో ప్రజలు సంచరించే ఈ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం లభ్యం కావడం చర్చనీయాంశంగా మారింది. మహిళ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మహిళ మృతదేహం గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోగా.. పోలీసులు మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే.. ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో (1st Town Police Station) సంప్రదించాలని కోరారు.