Homeక్రైంcyber fraud | సైబర్​ మోసగాళ్ల చెరలో మహిళ.. ఆరు నెలల్లో రూ. 32...

cyber fraud | సైబర్​ మోసగాళ్ల చెరలో మహిళ.. ఆరు నెలల్లో రూ. 32 కోట్ల స్కాం!

cyber fraud | ఆన్​లైన్​ మోసాలు, డిజిటల్​ అరెస్టు గురించి ప్రభుత్వం ఎంత అవగాహన కల్పించినా.. సామాన్యుల్లో చైతన్యం కావడం లేదు. 

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: cyber fraud | ఆన్​లైన్​ మోసాలు, డిజిటల్​ అరెస్టు గురించి ప్రభుత్వం ఎంత అవగాహన కల్పించినా.. సామాన్యుల్లో చైతన్యం కావడం లేదు.

ఎక్కడో ఒక చోట రోజుకో మోసం వెలుగు చూస్తూనే ఉంది. రూ.వేలు, రూ. లక్షలతోపాటు రూ.కోట్లలో సొమ్ము సైబర్ నేరగాళ్ల చేతిలో పెట్టేస్తున్నారు. బాధితుల్లో సామాన్యులతోపాటు ప్రధానంగా సర్కారు ఉద్యోగులు, రాజకీయ నాయకులు సైతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

బెంగళూరులో మరో సైబర్​ మోసం వెలుగుచూసింది. ఇక్కడి ఇండిరానగర్​లో నివాసం ఉండే ఐటీ నిపుణురాలు(57) సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని సర్వం కోల్పోయింది.

డిజిటల్ అరెస్టు పేరుతో గత ఆరు మాసాల్లో ఈమె రూ.31.83 కోట్లను సైబర్​ మోసగాళ్లకు ధారాదత్తం చేసింది. సెప్టెంబర్ 15, 2024న మొదట ఈమెకు డీహెచ్ఎల్ కొరియర్ సంస్థ పేరు మీద కాల్ వచ్చింది.

cyber fraud | పార్సిల్​లో మాదక ద్రవ్యాలు

ముంబయిలో సదరు బాధితురాలి పేరు మీద వచ్చిన పార్సిల్​లో పాస్ పోర్టులు, క్రెడిట్ కార్డులు, MDMA మాదక ద్రవ్యాలు ఉన్నాయనేది ఆ ఫోన్​ కాల్​ సారాంశం.

తనకు సంబంధం లేదని చెప్పినా.. ఆమెను భయపెట్టే ప్రయత్నం చేశారు. “సైబర్ క్రైమ్ సెల్”కు ఫోన్​ కలిపినట్లు తెలిపారు. అనంతరం సీబీఐ ఆఫీసర్​గా ఒకడు మాట్లాడటం మొదలుపెట్టాడు.

అంతర్జాతీయ స్థాయిలో నేరగాళ్లు ఆమెను గమనిస్తురని భయపెట్టాడు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వొద్దని బెదిరించాడు. ఆమెను నిరంతరం స్కైప్ వీడియో ద్వారా నియంత్రించాడు.

ఆర్బీఐ ఆర్థిక నిఘా విభాగానికి ఆమె ఆస్తుల వివరాలు అందజేయాలని ఒత్తిడి చేశాడు. అలా బాధితురాలి నుంచి 187 ట్రాన్సాక్షన్ల (దఫాల్లో) లో రూ.31.83 కోట్లు కాజేశారు నేరగాళ్లు.

దీనిపై బాధితురాలు ఈనెల (నవంబరు) 14 వ తేదీన సైబర్ క్రైమ్​కు ఫిర్యాదు చేయటంతో ఈ భారీ విషయం వెలుగు చూసింది.