అక్షరటుడే, వెబ్‌డెస్క్: Data Theft | కంపెనీకి సంబంధించిన డేటా చోరీ చేసిందని యాజమాన్యం పెట్టిన కేసులో ఓ మహిళకు 16 ఏళ్ల తర్వాత శిక్ష పడింది. అనసూయ వేమూరి Anasuya Vemuri అనే మహిళ ఎస్ఐఎస్(SIS) ఇన్ఫో టెక్ కంపెనీలో Info Tech Company మేనేజర్‌గా పనిచేసేది. ఆమె 2005లో కంపెనీ నుంచి బయటకు వచ్చింది. అయితే కంపెనీకి సంబంధించిన డేటాను company data ఆమె దొంగిలించినట్లు కంపెనీ ఆరోపించింది. కంపెనీని విడిచిపెట్టినప్పటికీ, ఆమె కంపెనీ డేటాను company data అనధికారికంగా యాక్సెస్ acces చేస్తూ వ్యక్తిగత లాభం కోసం ఉపయోగించుకుందని ఆరోపించింది. ఈ మేరకు అనసూయపై కంపెనీ 2009లో కోర్టులో court పిటిషన్ వేశారు. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అనసూయ కంపెనీని మోసం చేయడంతో పాటు ఆ డేటాతో కొత్త సంస్థను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఆమెను దోషిగా తేలుస్తూ ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా వేసింది.
