Homeఆంధప్రదేశ్Tirupati | కూతురు ముందే అల్లుడితో వివాహానికి సిద్ధమైన మహిళ

Tirupati | కూతురు ముందే అల్లుడితో వివాహానికి సిద్ధమైన మహిళ

ఓ మహిళ తన కూతురు భర్తతోనే అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతేగాకుండా ఆమె ఎదుటే అల్లుడిని వివాహం చేసుకోవాలని చూసింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirupati | మానవ సంబంధాలు రోజు రోజుకు దారుణంగా మారుతున్నాయి. తాజాగా ఓ మహిళ తన కూతురి ఎదుటే అల్లుడిని పెళ్లి చేసుకోవాలని చూసింది. అంతేగాకుండా అడ్డుకున్న కూతురిపై దాడి చేసింది.

ప్రస్తుతం చాలా మంది ప్రేమ, వివాహేతర సంబంధాల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వావి వరుసలు మరిచి పోతున్నారు. ఆంధ్రప్రదేశ్​ (AP)లోని తిరుపతి కేవీబీ పురంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక, 18 ఏళ్ల బాలుడు ఐదు నెలల క్రితం ప్రేమ పెళ్లి (Love Marriage) చేసుకున్నారు. బాలిక తల్లితో కలిసి ఆ దంపతులు జీవిస్తున్నారు.

Tirupati | అల్లుడితో వివాహేతర సంబంధం

ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటుండటంతో సదరు మహిళకు అల్లుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె అల్లుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కూతురి ఎదుటే అల్లుడితో తాళి కట్టించుకోవాలని చూసింది. అయితే ఆ బాలిక వారిని అడ్డుకుంది. దీంతో ఇద్దరు కలిసి బాలికపై రోకలి బండతో దాడి చేశారు. దీంతో ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కాపాడారు. అనంతరం అత్త, అల్లుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

కాగా ఓ బాలిక 15 ఏళ్లకే ప్రేమ, పెళ్లి చేసుకోవడం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. సినిమాలు, స్మార్ట్​ ఫోన్​, ఓటీటీల ప్రభావంతో నేటి పిల్లలు చెడిపోతున్నారు. చిన్నతనంలోనే ప్రేమ, పెళ్లి అంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరోవైపు ఓ తల్లి ఏకంగా అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకొని కూతురిపై దాడి చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇలాంటి మహిళలను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేస్తున్నారు.