ePaper
More
    HomeతెలంగాణWarangal | భర్తకు విషమిచ్చి బావ దగ్గరకు వెళ్లిపోయిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

    Warangal | భర్తకు విషమిచ్చి బావ దగ్గరకు వెళ్లిపోయిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Warangal | దేశవ్యాప్తంగా భార్యలు భర్తలను హతమారుస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వివాహేతర సంబంధాలు (Extramarital Affairs), ప్రేమ వ్యవహారాలు, కుటుంబ కలహాలతో కొంతమంది మహిళలు కట్టుకున్న వాడిని కడతేరుస్తున్నారు.

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ, గద్వాల్​ తేజేశ్వర్​ హత్యలు మరువక ముందే.. ఇటీవల యాదాద్రి జిల్లాలో ఓ మహిళ తన భర్తను కారుతో ఢీకొట్టించి హత్య చేయించింది. తాజాగా మరో మహిళ తన భర్తకు కూల్​ డ్రింక్​లో పురుగుల మందు కలిపి తాగించి చంపింది. ఈ ఘటన వరంగల్ జిల్లా (Warangal District) వర్ధన్నపేట మండలం భవానీకుంట తండాలో చోటు చేసుకుంది.

    భవానీకుంట తండా (Bhawani Kunta Thanda)కు చెందిన బాలాజీ (44) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 8న బాలాజీ చికెన్​ తెచ్చి భార్యకు వండమని చెప్పాడు. తాను మద్యం తాగి వస్తానని బయటకు వెళ్లగా భార్య ఆపింది. ఇంట్లోనే మద్యం ఉందని చెప్పి.. కూల్​డ్రింక్​లో గడ్డిమందు కలిపి ఇచ్చింది. అది తాగిన వెంటనే బాలాజీ గొంతులో మంటతో కేకలు వేయడంతో.. ఎలాగూ చనిపోతాడని భావించి అదే తండాలోని తన బావ ఇంటికి వెళ్లిపోయింది.

    Warangal | ఆస్పత్రికి తరలించిన స్థానికులు

    గడ్డిమందు తాగిన బాలాజీ కేకలు వేయడంతో గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి హరిచంద్ ఫిర్యాదు మేరకు భార్యతో పాటు, ఆమె బావ దశరుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలతో తన బావ దశరు ప్రోత్సాహంతో సదరు మహిళ భర్తను చంపినట్లు బాలాజీ తండ్రి ఫిర్యాదు చేశారు.

    More like this

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...

    tarpaulin covers Distribution | శిథిలావస్థకు చేరిన ఇళ్ల పరిశీలన.. బాధితులకు టార్పాలిన్​ల అందజేత

    అక్షరటుడే, కోటగిరి: tarpaulin covers Distribution | నిజామాబాద్​ జిల్లా Nizamabad district రూద్రూర్ మండల Rudrur mandal...