అక్షరటుడే, వెబ్‌డెస్క్: Shubhalagnam | తెలుగు ప్రేక్షకులకు శుభలగ్నం సినిమా గుర్తుండే ఉంటుంది. జగపతిబాబు, ఆమని, రోజా (Roja) ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ సినిమాలో జగపతిబాబును చూసి ఇష్టపడిన రోజా.. డబ్బు పిచ్చి ఉన్న ఆమనికి డబ్బులిచ్చి డైవర్స్ (Divorce) ఇప్పించి, ఆ తర్వాత జగపతిబాబును (Jagapathi Babu) పెళ్లి చేసుకుంటుంది.
అయితే ఆమని డబ్బు దక్కించుకున్నప్పుడు సంతోషంగానే ఉన్నా తర్వాత కుమిలి కుమిలి ఏడ్చింది. అయితే ఈ కథ మాదిరిగానే ఓ వాస్తవ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. డబ్బు వెచ్చించి ఒక వివాహితుడికి విడాకులు ఇప్పించి పెళ్లి చేసుకున్న ఓ సంపన్న మహిళ, ఏడాదికే అతనితో తెగ తెంపులు చేసుకుంది. ఈ క్రమంలో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోర్టుకు వెళ్లిన ఘటన చైనాలో (China) సంచలనం సృష్టిస్తోంది.
Shubhalagnam | వివాహితుడితో ప్రేమలో పడిన కంపెనీ ఓనర్
చైనాలో ఒక పెద్ద కంపెనీకి ఓనర్‌గా ఉన్న సంపన్న మహిళ, అందులో పని చేస్తున్న యువకుడితో ప్రేమలో పడింది. కానీ ఆ యువకుడు అప్పటికే ఓ మహిళని పెళ్లి చేసుకొని, ఒక కుమార్తెకి జన్మనిచ్చాడు. కానీ వారిద్దరి మధ్య ప్రేమ గాఢంగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. తన ప్రేమికుడికి సహాయం చేయడానికి, అతని భార్యకు 3 మిలియన్ యువాన్ (సుమారు రూ.3.7 కోట్లు) బదిలీ చేసింది. దీనిని డివోర్స్ సెటిల్‌మెంట్ (divorce settlement) మరియు పిల్లల మెయింటెనెన్స్ కోసం ఇచ్చినట్లు ఆమె తెలిపింది. డబ్బు అందుకున్న భార్య విడాకులకు అంగీకరించింది. అనంతరం ప్రేమికురాలు తన ప్రేమికుడిని వివాహం చేసుకుంది.
వివాహం జరిగిన ఏడాదిలోనే వారి మధ్య విభేదాలు తలెత్తాయి. సంబంధం బ్రేక్ అయిన నేపథ్యంలో, తన డబ్బును తిరిగి ఇవ్వాలని ఆ మహిళ డిమాండ్ చేసింది. డివోర్స్ సెటిల్‌మెంట్ కింద ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని ఆమె మాజీ భర్త మరియు అతని మాజీ భార్యను కోరింది. వారు తిరస్కరించడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది.
కేసును విచారించిన చైనా అప్పీల్ కోర్టు (China appeals court) మాత్రం ఆమె డిమాండ్‌కి షాకింగ్ రెస్పాన్స్ ఇచ్చింది. ఇది డివోర్స్ సెటిల్‌మెంట్, పిల్లల మేలు కోసం ఇచ్చిన సొమ్ము. ప్రేమ విఫలమైందని చెప్పి తిరిగి డబ్బు కోరడం అనైతికం. ఇతరుల వివాహ బంధాన్ని చెడగొట్టడం, ఆ తర్వాత రీఫండ్ కోరడం సమాజ నైతిక విలువలకు విరుద్ధం అని చెప్పింది. ఈ తీర్పు అనంతరం ఆమె ఆశలు ఛిన్నాభిన్నమయ్యాయి. కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆమె కోపంతోనూ, నిరాశతోనూ అక్కడి నుండి వెళ్లింది.