అక్షరటుడే, హైదరాబాద్: Woman Murder Case | రాజేంద్రనగర్ (Rajendranagar) – కిస్మత్ పూర (Kismatpura) లో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
ఇద్దరు ఆటో డ్రైవర్లు బాధిత మహిళను దారుణంగా రేప్ చేసి, అత్యంత కిరాతకంగా చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈమేరకు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Woman Murder Case | ఏం జరిగిందంటే..
గత ఆదివారం మధ్యాహ్నం యాకత్ పూరా (Yakatpura) నుంచి హైదర్ గూడాకు వచ్చిన సదరు మహిళ.. కల్లు తాగి మత్తులో రోడ్డుపై పడిపోయింది.
మహిళను గమనించిన ఆటో డ్రైవర్లు.. ఆమెను కిస్మత్ పూర బ్రిడ్జి కిందకు తీసుకెళ్లారు. అక్కడ ఆ ఇద్దరు ఆటో డ్రైవర్లు ఒకరి తర్వాత ఒకరు దారుణంగా అత్యాచారం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
మహిళ తమకు సహకరించడం లేదని మానవ మృగాలు క్రూరంగా ప్రవర్తించాయి. ఆమెను పూర్తిగా వివస్త్రను చేసి మర్మాగంలో కర్రలు గుచ్చి, అత్యంత కిరాతకంగా హతమార్చారు.
అనంతరం మృతదేహాన్ని అక్కడే పడేసి పారిపోయారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు.. ఐదు రోజులు శ్రమించి హంతకులను పట్టుకున్నారు.