అక్షరటుడే, వెబ్‌డెస్క్: Grok Features | శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది (MP Priyanka Chaturvedi) శుక్రవారం కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు (Minister Ashwini Vaishnav) లేఖ రాశారు. ఏఐ చాట్‌బాట్ గ్రోక్ (AI chatbot Grok) దుర్వినియోగంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల ఏఐ ద్వారా డీప్ ఫేక్ వీడియోలు (deepfake videos) తయారు చేస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో (social media) అనధికారికంగా మహిళల చిత్రాలను ఏఐ ద్వారా ఉపయోగిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మహిళలను లైంగికంగా చిత్రీకరించడానికి, దుస్తులు విప్పడానికి ప్రేరేపించబడుతున్న సంఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆమె మంత్రిని కోరారు.
Grok Features | చర్యలు చేపట్టాలి
ఇటీవల గ్రోక్ చాట్‌బాట్‌కు సాధారణ మహిళ ఫొటోను అశ్లీలంగా మార్చాలని చెబితే.. అలాగే చేస్తోంది. దీంతో మహిళల మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఘటనలు మహిళల భద్రతకు హానీ కలిగించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎంపీ ప్రియాంక మహిళల గౌరవాన్ని ఉల్లంఘించేలా ఉన్న గ్రోక్ ఫీచర్ల తొలగింపునుకు చర్యలు చేపట్టాలని కోరారు. మహిళ ఫొటోలను అశ్లీలంగా మార్చాలని ప్రాంప్ట్ ఇస్తే.. గ్రోక్ అంగీకరిస్తోందన్నారు. ఇది మహిళల భద్రతకు భంగం కలిగిస్తోందని చెప్పారు. ఐటీ మంత్రి మంత్రి సదరు యాప్‌లతో చర్చించి భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.