Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Collectorate | ‘నాకు కలెక్టర్​ పోస్టింగ్​ ఇచ్చారు.. నా చాంబర్​ ఎక్కడా’ అంటూ.. కలెక్టరేట్​లో...

Kamareddy Collectorate | ‘నాకు కలెక్టర్​ పోస్టింగ్​ ఇచ్చారు.. నా చాంబర్​ ఎక్కడా’ అంటూ.. కలెక్టరేట్​లో మహిళ హల్​చల్​..!

కామారెడ్డి కలెక్టరేట్​లో ఓ మహిళ హంగామా చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తనకు కలెక్టర్​ పోస్టింగ్​ వచ్చిందంటూ అక్కడ ఉన్న సిబ్బందికి పేర్కొంది.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collectorate | ‘కలెక్టర్​గా పోస్టింగ్ ఇచ్చారు. నా ఛాంబర్ ఎక్కడ.. నా కుర్చీ ఏది’ అంటూ ఓ మహిళ కామారెడ్డి కలెక్టరేట్​లో (Kamareddy Collectorate) హల్​చల్​ చేసింది. విశ్వసనీయ వర్గాల ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

కామారెడ్డి కలెక్టరేట్​కు మంగళవారం ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో వచ్చింది. తనకు కామారెడ్డి కలెక్టర్​గా పోస్టింగ్ ఇచ్చారని ఒక ఫేక్ లెటర్ (fake letter) అధికారులకు చూపింది. తన కుర్చీ ఎక్కడ.. ఛాంబర్ ఎక్కడ అంటూ హడావుడి చేసింది. సదరు మహిళ వచ్చిన సమయంలో ఉన్నతాధికారులు ఎవరూ కలెక్టరేట్​లో అందుబాటులో లేరు.

విషయాన్ని సిబ్బంది డీఆర్వోకు ఫోన్ ద్వారా తెలపగా ఆయన వచ్చేసరికి సదరు మహిళ కారులో కుటుంబ సభ్యులతో వెళ్లిపోయింది. ఫోన్ చేస్తే రెండు రోజుల తర్వాత జాయిన్ అవుతానని సమాధానమిచ్చింది. దాంతో సీసీ కెమెరాల (CCTV cameras) ద్వారా తూప్రాన్ వద్ద ఆమె ఆచూకీని కనుగొన్నారు. డీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం.

Kamareddy Collectorate | తండ్రి సంతోషం కోసమే..

విచారణలో సదరు మహిళ గురించి పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. సదరు మహిళ కాంపిటేటివ్ పరీక్షలకు సన్నద్ధమై ఎన్ని పరీక్షలు రాస్తున్నా ఉద్యోగం రావడం లేదు. దీంతో తనకు ఉద్యోగం రాకపోవడంతో తన తండ్రి బాధపడుతున్నాడని ఆమె ఇలా కామారెడ్డి కలెక్టర్​గా ఉద్యోగం వచ్చిందంటూ ఫేక్​ లెటర్​తో నాటకం ఆడినట్లు పోలీసులకు తెలిసినట్లు సమాచారం.