Homeక్రైంHyderabad City | నగలు పోవడంతో కుమారుడితో సహా భవనంపై నుంచి దూకిన మహిళ

Hyderabad City | నగలు పోవడంతో కుమారుడితో సహా భవనంపై నుంచి దూకిన మహిళ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ hyderabad city నగరంలోని వనస్థలిపురం ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది.

బంగారు ఆభరణాలు gold Jewelry పోవడంతో ఓ మహిళ తన కుమారుడితో కలిసి భవనంపై నుంచి దూకింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. చింతకుంటలోని chintakunta ఆగమయ్యనగర్​లోని ఓ అపార్ట్​మెంట్​లో నివాసం ఉండే సుధేష్ణ(28) ఇటీవల ఓ వివాహానికి హాజరైంది. ఈ నెల 16న నాచారంలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్న సమయంలో ఆమె బంగారు ఆభరణాలు పోయాయి.

ఏడు తులాల బంగారు ఆభరణాలు చోరీ కావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో తన రెండున్నరేళ్ల కుమారుడు ఆరుష్ కుమార్‌తో పాటు మూడో అంతస్తు నుంచి దూకింది. వారిని ఆస్పత్రికి తరలించగా తీవ్రంగా గాయపడిన సుధేష్ణ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె కుమారుడు స్వల్పగాయాలతో బయట పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.