HomeతెలంగాణFraud | కిలేడి లేడి మాములుది కాదు.. అక్కడ డాక్టర్.. ఇక్కడ ఐఏఎస్..!

Fraud | కిలేడి లేడి మాములుది కాదు.. అక్కడ డాక్టర్.. ఇక్కడ ఐఏఎస్..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Fraud | ప్రస్తుత రోజుల్లో మ‌గాళ్లే కాదు.. మ‌హిళలు కూడా మ‌హా ముదుర్లు అవుతున్నారు. మంచిగా ఉన్న‌ట్టు న‌టిస్తూ బొక్క బోర్లా కొట్టిస్తున్నారు.

ప్రత్యేకించి ఈ మ‌ధ్య కాలంలో నకిలీ ఐఏఎస్(Fake IAS), ఐపీఎస్‌(IPS)ల బాగోతాలు కూడా కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఓ కిలాడి తాను ఐఏఎస్ నంటూ హంగామా చేసింది. రాజకీయ నాయకుల బంధువునని ఫోజులు కొడుతూ మాయ మాటలతో పురుషులకు వలపు వల వేసి అందిన కాడికి దోచేసింది. ఆమెపై రాష్ట్రంలో అనేక చోట్ల పోలీస్ కేసులు Police Cases నమోదయ్యాయి. కిలాడీ ఆగడాలు పెరగడంతో.. దృష్టిపెట్టిన మిర్యాలగూడ పోలీసులు(Miryalaguda Police) ఎట్టకేలకు మాయదారి లేడి ఆట కట్టించారు.

Fraud | భ‌లే మోసం చేస్తుందిగా..

మిర్యాలగూడ మం. లావుడి తండాకు చెందిన సరిత Sarita హాస్టల్‌లో ఉంటూ అమ్మాయిల వద్ద నగదు సెల్ ఫోన్లు ఎత్తుకెళుతుంది. ఓ యువకుడిని డబ్బు ఇవ్వకుంటే చంపేస్తానంటూ బెదిరించింది. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు (Police) యువతిని అరెస్టు చేశారు.

ఏడాది క్రితం ఓ వైద్యుడిని బ్లాక్ మెయిల్ చేసి రూ.5 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈజీ మనీ(Easy Money) కోసం అలవాటు పడిన సరితకు మోసాలు చేయడం అలవాటయింది. హైదరాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ తదితర పట్టణాల్లో అద్దె ఇంట్లో ఉంటూ సమీప మహిళలతో పరిచయం పెంచుకునేది. అదును చూసి వారి సెల్ ఫోన్లు కొట్టేసేది.

ఇటీవల ఓ యువకుడిని డబ్బులు డిమాండ్‌ చేయడంతో పాటు.. డబ్బులు ఇవ్వకుంటే చంపుతానని బెదిరించింది. దీంతో ఆ యువకుడు పోలీసులను Police ఆశ్రయించాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అయితే.. పోలీసుల విచారణలో దిమ్మతిరేగే వాస్తవాలు వెల్లడయ్యాయి. సరిత చేస్తున్న దందాలు చూసి పోలీసులే షాక్ అయ్యారు..!